Begin typing your search above and press return to search.

భగవంత్ కేసరి బడ్జెట్ ఎంతంటే?

శ్రీలీల మూవీలో బాలయ్య కూతురిగా నటిస్తూ ఉండగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేస్తోంది.

By:  Tupaki Desk   |   16 Oct 2023 5:29 AM GMT
భగవంత్ కేసరి బడ్జెట్ ఎంతంటే?
X

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సినిమా భగవంత్ కేసరి. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ గట్టిగా జరుగుతున్నాయి. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. శ్రీలీల మూవీలో బాలయ్య కూతురిగా నటిస్తూ ఉండగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేస్తోంది.

ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఉయ్యాలో ఉయ్యాలా సాంగ్ కూడా భాగా క్లిక్ అయ్యి ట్రెండ్ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ బడ్జెట్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇంటరెస్టింగ్ టాక్స్ నడుస్తున్నాయి. ఈ సినిమా కోసం ఏకంగా వంద కోట్ల బడ్జెట్ తో ఖర్చు పెట్టారంట. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బాలయ్య సక్సెస్ ల మీద ఉన్నారు.

అందుకే రెమ్యునరేషన్ గత చిత్రాలకంటే పెరిగింది. అలాగే దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఎక్కువగానే చార్జ్ చేస్తున్నారు. వీరిద్దరి రెమ్యునరేషన్ ఇంచు మించుగా 50 కోట్ల వరకు ఉంటుందని టాక్. మిగిలిన బడ్జెట్ ఇతర క్యాస్టింగ్ తో పాటు మూవీ కోసం ఖర్చు పెట్టి ఉంటారని ఇండస్ట్రీ వర్గాలలో చెప్పుకుంటున్నారు.

అఖండ బ్లాక్ బస్టర్ తో బాలయ్య మార్కెట్ కూడా అమాంతం పెరిగింది. దానికి తగ్గట్లుగానే భగవంత్ కేసరి హిట్ కాంబోలో వస్తోన్న సినిమా కాబట్టి థీయాట్రికల్, నాన్ థీయాట్రికల్ బిజినెస్ గట్టిగానే జరిగిందంట. మూవీకి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం మొదటి వారంలోనే వంద కోట్లు కొల్లగొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరి కంప్లీట్ తెలంగాణ స్లాంగ్ తో మొదటిసారిగా బాలయ్య చేసిన భగవంత్ కేసరి పాత్ర ప్రేక్షకులకి ఏ మేరకు కనెక్ట్ అవుతుంది, సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది వేచి చూడాలి. ఒక వేళ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాలయ్య ఖాతాలో హ్యాట్రిక్ హిట్ మూవీగా ఈ చిత్రం చేరుతుంది. చాలా కాలం తర్వాత హ్యాట్రిక్ బాలయ్య కెరియర్ లో నమోదవుతుంది. అనిల్ రావిపూడికి కూడా డబుల్ హ్యాట్రిక్ వస్తుంది.