Begin typing your search above and press return to search.

బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్.. ఎలా ఉందంటే?

ఇద్దరూ కలిసి ఏం చేశారన్నది రెండో ఎపిసోడ్‌లో చూపించారు. అయితే రెండు పాత్రలనూ పరిచయం చేసిన తీరు అద్భుతంగా ఉంది.

By:  Tupaki Desk   |   1 Jun 2024 8:12 AM GMT
బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్.. ఎలా ఉందంటే?
X

అయితే సినిమాలో ప్రభాస్ భైరవ పాత్రలో యాక్ట్ చేస్తుండగా.. ఆయన వెహికల్ బుజ్జి ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇటీవల మేకర్స్ బుజ్జి రివీల్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. బుజ్జి టీజర్ ను కూడా రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక భైరవ, బుజ్జి ఎలా కలిశారన్న పాయింట్ ను తెలిపేందుకు బుజ్జి అండ్‌ భైరవ పేరుతో యానిమేటెడ్‌ సిరీస్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది నాగ్ అశ్విన్ టీమ్.

ఇంకా థియేటర్లోకి విడుదల కాకముందే సినిమాలోని రోల్స్ ను సిరీస్ ద్వారా పరిచయం చేయాలనుకున్న నాగ్ అశ్విన్ కు హ్యాట్సాఫ్ కచ్చితంగా చెప్పాల్సిందే. కార్గో షిప్ లో బుజ్జి, కాశీ సిటీలో భైరవ పాత్రలను తొలి ఎపిసోడ్ లో పరిచయం చేశారు మేకర్స్. ఇద్దరూ కలిసి ఏం చేశారన్నది రెండో ఎపిసోడ్‌లో చూపించారు. అయితే రెండు పాత్రలనూ పరిచయం చేసిన తీరు అద్భుతంగా ఉంది. ముఖ్యంగా బుజ్జికి కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ కరెక్ట్ గా సరిపోయింది.

ఓటీటీ ఆడియన్స్ నుంచి యానిమేటెడ్ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. రెండు ఎపిసోడ్ లు.. ఒక్కొక్కటి 14 నిమిషాల క్రిస్పీ రన్ టైమ్ తో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా యానిమేషన్ క్వాలిటీకి ఫిదా అయిపోయారు. ప్రభాస్‌ రోల్ కు యాక్షన్‌ తో పాటు ఎంటర్టైన్మెంట్ యాడ్ చేయడం చాలా బాగుంది. మధ్యలో ఇంటి యజమాని (బ్రహ్మానందం) పాత్ర చెప్పే డైలాగులు నవ్వులు పూయిస్తాయి. గ్రీన్‌ గోల్డ్‌ యానిమేషన్‌ సంస్థ సిరీస్‌ ను చక్కగా తీర్చిదిద్దింది.

కీర్తి సురేష్ వాయిస్ ఓవర్‌ తో పాటు ప్రభాస్, బ్రహ్మీ వాయిస్ ఓవర్‌ లు కూడా అట్రాక్ట్ చేస్తున్నాయి. మొత్తానికి సిరీస్ అందరినీ అలరిస్తూ ప్రశంసలు అందుకుంటోంది. అయితే యానిమేటెడ్ సిరీస్ ను బాగా రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఈ సిరీస్ సూపర్ హిట్ అవ్వడంతో కల్కి మూవీ టీమ్ మంచి జోష్ లో ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.