Begin typing your search above and press return to search.

భైరవ అండ్ బుజ్జి.. నెక్స్ట్ ఎపిసోడ్స్ ఎప్పుడంటే..

ప్రస్తుతం థియేటర్స్ లో చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ లేకపోవడంతో ఆడియన్స్ కల్కి సినిమా పట్ల ఆసక్తి చూపిస్తున్నారు

By:  Tupaki Desk   |   15 July 2024 10:07 AM GMT
భైరవ అండ్ బుజ్జి.. నెక్స్ట్ ఎపిసోడ్స్ ఎప్పుడంటే..
X

కల్కి 2898ఏడీ మూవీ సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో కొనసాగుతోంది. మూడు వారాల తర్వాత కూడా సినిమాకి డీసెంట్ వసూళ్లు వస్తూ ఉండటం విశేషం. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 1000 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం లాంగ్ రన్ లో ఎన్ని కోట్ల వద్ద ఎండ్ అవుతుంది తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంది. ప్రస్తుతం థియేటర్స్ లో చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ లేకపోవడంతో ఆడియన్స్ కల్కి సినిమా పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కారణంగా శని, ఆదివారాలు మళ్ళీ మంచి కలెక్షన్స్ వచ్చాయి.

నార్త్ ఇండియన్ బెల్ట్ లో హిందీ వెర్షన్ కి 250+ కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే కల్కి పార్ట్ 2పైన ప్రేక్షకుల ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగ్ అశ్విన్ ఈ సీక్వెల్ పై ఎప్పుడు అప్డేట్ ఇస్తాడనేది తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంది. అంతకంటే ముందుగా నాగ్ అశ్విన్ ఇంటరెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. కల్కి మూవీ రిలీజ్ కి ముందు భైరవ అండ్ బుజ్జి యానిమేషన్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు.

ఈ సిరీస్ కి మంచి స్పందన వచ్చింది. అసలు బుజ్జి భైరవకి ఎలా దొరికింది. కారుని ప్రభాస్ ఎలా డిజైన్ చేసాడు అనేది ఈ సిరీస్ రెండు ఎపిసోడ్స్ లో చూపించారు. ఇక భైరవ అండ్ బుజ్జి సిరీస్ లో మరో రెండు ఎపిసోడ్స్ ఉన్నాయని మూవీ రిలీజ్ తర్వాత వాటిని ప్రేక్షకులకి అందిస్తామని నాగ్ అశ్విన్ ఎనౌన్స్ చేశాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగ్ అశ్విన్ యూఎస్ లో మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా మూవీ స్పెషల్ స్క్రీనింగ్ కి అటెండ్ అయ్యారు..

స్క్రీనింగ్ సందర్భంగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ భైరవ అండ్ బుజ్జి వెబ్ సిరీస్ లో రాబోయే నెక్స్ట్ రెండు ఎపిసోడ్స్ గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ రెండు ఎపిసోడ్స్ కూడా నాలుగో ప్రపంచంలో ఉంటాయని తెలిపారు. కల్కి చిత్రంలో కాశి, కంప్లెక్స్, శంబాలా ప్రాంతాలు చూపించడం జరిగింది. నెక్స్ట్ సుమతిని సేవ్ చేయడం కోసం నాలుగో ప్రపంచంలోకి తీసుకొని వెళ్తారు. ఆ ప్రపంచం పేరు ఫ్లక్స్ ల్యాండ్స్. భైరవ అండ్ బుజ్జి ఆ ఫ్లక్స్ ల్యాండ్స్ కి ఎలా వెళ్లారు.

అక్కడ ఎలాంటి సాహసాలు చేశారు. చేశారనేది చూపించబోతున్నాం. శంబాలాకి వెళ్లిన తర్వాత అక్కడ వీరన్ క్యారెక్టర్ ఫ్లక్స్ ల్యాండ్స్ కి సుమతిని తరలించాలని చెబుతాడు. కల్కి పార్ట్ 2 కూడా ఫ్లక్స్ ల్యాండ్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అంతకంటే ముందుగా భైరవ అండ్ బుజ్జి సిరీస్ తో ఈ ఫ్లక్స్ ల్యాండ్స్ ఎలా ఉంటాయనేది నాగ్ అశ్విన్ చూపించబోతున్నట్లు తెలుస్తోంది.