Begin typing your search above and press return to search.

బుజ్జి (Vs) భైర‌వ‌: కిడ్స్‌ని ఆక‌ర్షించే ఎత్తుగ‌డ‌?

9 ట‌న్నుల బ‌రువుండే సూప‌ర్ కార్ రూప‌క‌ల్ప‌న కోసం ఆనంద్ మ‌హీంద్ర టీమ్ స‌హ‌క‌రించిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   28 May 2024 5:56 AM GMT
బుజ్జి (Vs) భైర‌వ‌: కిడ్స్‌ని ఆక‌ర్షించే ఎత్తుగ‌డ‌?
X

కల్కి 2898 AD ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీగా బ‌రిలో దిగుతోంది. ప్ర‌భాస్ న‌టించిన ఈ సినిమా జూన్ లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గా, ప్ర‌చారంలో చిత్ర‌బృందం ఎక్క‌డా తగ్గ‌డం లేదు. ఇంత‌కుముందు బుజ్జి ది రోబోటిక్ సూప‌ర్ కార్ ని ప‌రిచ‌యం చేయ‌గా అది సంచ‌ల‌నంగా మారింది. భైర‌వ‌కు స‌హాయ‌కుడిగా బుజ్జి పాత్ర ఎంతో కీల‌కంగా క‌నిపించ‌నుందని ఈ లుక్ లాంచ్ తో క్లారిటీ వ‌చ్చింది. 9 ట‌న్నుల బ‌రువుండే సూప‌ర్ కార్ రూప‌క‌ల్ప‌న కోసం ఆనంద్ మ‌హీంద్ర టీమ్ స‌హ‌క‌రించిన సంగ‌తి తెలిసిందే.

ఈ వేసవిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రంగా ఇప్ప‌టికే క‌ల్కి అంద‌రి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక బుజ్జి మ్యాజిక్ పిల్ల‌లు పెద్ద‌లు అంద‌రిలో వ‌ర్క‌వుటవ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. బుజ్జి, భైరవ ప్రయాణానికి సంబంధించిన ప్రీల్యూడ్ విడుద‌లై వైర‌ల్ గా మారింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది అందుబాటులో ఉంటుంది. ప్రీల్యూడ్ టీజ‌ర్ ముఖ్యంగా పిల్ల‌ల‌ను విశేషంగా ఆక‌ర్షిస్తోంది.

ఈ టీజ‌ర్ లో కిడ్స్ భైర‌వ‌ను వెంబ‌డిస్తున్నారు. అత‌డు వారికి స‌రైన స‌మాధానం చెప్పాల్సి వ‌స్తోంది. బుజ్జితో క‌లిసి అత‌డు ఏం చేసాడ‌న్నది పూర్తి వీడియో చూడాల్సిందే. టీజర్‌లో బుజ్జి & భైరవ యానిమేటెడ్ యాక్షన్-కట్ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. క‌ల్కి చిత్రంలో పిల్ల‌ల‌ను ఆక‌ర్షించే మెటీరియ‌ల్ ఉంద‌ని ఈ ప్రీల్యూడ్ తో స్ప‌ష్ఠ‌త వ‌చ్చింది. ట్రైల‌ర్ జూన్ మొద‌టి వారంలో విడుద‌ల కానుంది. 27 జూన్ 2024న బ‌హుభాష‌ల్లో క‌ల్కి చిత్రం విడుదల కానుంది.