Begin typing your search above and press return to search.

పొట్టేల్ 'బుజ్జి మేక'.. మనసులను హత్తుకుంటోందిగా!

మంచి కంటెంట్ అండ్ నేపథ్యం ఉంటే చాలు.. సినిమాను ఆడియన్స్ తప్పక ఆదరిస్తారన్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   21 Jun 2024 5:54 AM GMT
పొట్టేల్ బుజ్జి మేక.. మనసులను హత్తుకుంటోందిగా!
X

మంచి కంటెంట్ అండ్ నేపథ్యం ఉంటే చాలు.. సినిమాను ఆడియన్స్ తప్పక ఆదరిస్తారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక చిత్రాల విషయంలో ఇది ప్రూవ్ అయింది. ఆయా మూవీలకు బ్రహ్మరథం పట్టి కాసుల వర్షం కురిసేలా కూడా చేశారు సినీ ప్రియులు. ఇప్పుడు అదే కోవలో వస్తున్నట్టు అనిపిస్తున్న మరో మూవీ పొట్టేల్. యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి సాహిత్ మోత్కురి దర్శకత్వం వహిస్తున్నారు.

తొలి ఇండిపెండెంట్ మూవీ 'బంధం రేగడ్' తో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న సాహిత్.. తన రెండో చిత్రం 'సవారీ'తో మంచి హిట్ సాధించారు. ఇప్పుడు తన మూడో సినిమా పొట్టేల్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్లు, టీజర్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఆడియన్స్ లో సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పటి వరకు రిలీజైన మూడు సాంగ్స్ ఛార్ట్ బస్టర్లుగా నిలిచాయి.

యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు శేఖర్ చంద్ర అద్భుతమైన మ్యూజిక్ అందిస్తున్నారు. ఫస్ట్ సింగిల్.. నగిరో నగిరారోలో హీరో హీరోయిన్ల లిప్ లాక్ సీన్ ఓ రేంజ్ లో ఉంది. సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంది. ఆ తర్వాత విడుదల చేసిన.. వవ్వరే, శంకర్ లిరికల్ సాంగ్స్ కూడా వేరే లెవల్ లో రెస్పాన్స్ దక్కించుకున్నాయి. తాజాగా మేకర్స్.. పొట్టేల్ మూవీ నుంచి నాలుగో సింగిల్.. బుజ్జి మేక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

బుజ్జి మేక.. బుజ్జి మేక అంటూ సాగుతున్న ఈ పాట.. మ్యూజిక్ లవర్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. విజువల్స్ ఫుల్ నేచురల్ గా ఉంటూ.. అట్రాక్ట్ చేస్తున్నాయి. సాంగ్ లో యువ చంద్ర కృష్ణ.. ఎమోషనల్ గా కనిపించారు. సినిమాలో ఆయన కుమార్తెగా నటిస్తున్న చిన్న పాప.. తన పాత్రలో ఒదిగిపోయింది. మొత్తానికి ఈ సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంటూ.. పొట్టేల్ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.

బుజ్జి మేక సాంగ్ కు కాసర శ్యామ్ అందించిన లిరిక్స్.. మనసును హత్తుకుంటున్నాయి. యంగ్ సింగర్ కాలభైరవ.. తన గాత్రంతో పాటలోని భావోద్వేగాలకు ప్రాణం పోశారు. ఓవరాల్ గా ఈ ఎమోషనల్ సాంగ్.. మ్యూజిక్ లవర్స్ ను మెప్పిస్తోంది. ఈ చిత్రాన్ని నిసా ఎంటర్టైన్మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్ బ్యానర్లపై సురేష్ కుమార్, నిశాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.