Begin typing your search above and press return to search.

కల్కి 2898AD- బుజ్జి థీమ్ మ్యూజిక్ విన్నారా..

ఈ 3 వీలర్ కారును సృష్టించడం ద్వారా, ఈ సినిమా దృశ్యాలలో మరింత నిజమైన అనుభూతిని ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

By:  Tupaki Desk   |   27 May 2024 12:27 PM GMT
కల్కి 2898AD- బుజ్జి థీమ్ మ్యూజిక్ విన్నారా..
X

సినిమా విజువల్ ఎఫెక్ట్స్ అనగానే చాలా మంది సీజీ సృష్టించే అద్భుతాలను ఊహిస్తారు. అయితే, "కల్కి 2898 ఏడి" చిత్ర యూనిట్ ఒక అడుగు ముందుకేసి రియాలిటీకి దగ్గరగా ఉండేలా 7 కోట్ల రూపాయల ఖర్చుతో "బుజ్జి" అనే ప్రత్యేకమైన కారును రూపొందించింది. ఈ 3 వీలర్ కారును సృష్టించడం ద్వారా, ఈ సినిమా దృశ్యాలలో మరింత నిజమైన అనుభూతిని ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

కారును డిజైన్ చేయడంలో ఆనంద్ మహీంద్రా ఆర్టోమొబైల్ ఇంజనీరింగ్ నిపుణులు కీలక పాత్ర పోషించారు. సినిమాకు అనుగుణంగా అత్యాధునిక టెక్నాలజీతో బుజ్జిని తయారు చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ కారును గ్రాండ్ గా లాంచ్ చేసి, మొదటి ప్రమోషన్లను ప్రారంభించారు.

ఇటీవల, అక్కినేని నాగ చైతన్య బుజ్జిని రేసింగ్ ట్రాక్ పై డ్రైవ్ చేసి, తన అనుభవాన్ని పంచుకున్నారు. "ఇలాంటి కారును కలలో కూడా ఊహించలేదు" అని చైతన్య తన ట్వీట్ లో పేర్కొన్నారు. వైజయంతీ మూవీస్ ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేయగా, చైతన్య కూడా దానిపై స్పందిస్తూ తన అనుభవాలను తెలియజేశారు.

అంతే కాకుండా బుజ్జి థీమ్ మ్యూజిక్ ను రీసెంట్ గా విడుదల చేశారు. ఇంట్రో టీజర్ లో యాక్షన్ బ్లాక్స్ తో మిక్స్ అయిన ఆ థీమ్ ట్యూన్ అద్భుతంగా ఉందని ప్రశంసలు రావడంతో ఇప్పుడు ప్రత్యేకంగా థీమ్ మ్యూజిక్ ను విడుదల చేశారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే.

బుజ్జి ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సినిమా రిలీజ్ అయ్యేలోపు బుజ్జి దేశమంతా చుట్టేస్తుందని, రేసింగ్, స్పోర్ట్స్ కార్లు డ్రైవ్ చేయడం ఇష్టపడే హీరోలందరూ ఈ కారును డ్రైవ్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఆనంద్ మహీంద్రా కూడా ఈ కారును రూపొందించడంలో తమ ఇంజనీరింగ్ టీమ్ ఎలా పనిచేసిందో వివరించారు.

ఈ కారు ద్వారా కల్కి టీమ్ సినిమా ప్రమోషన్లలో కొత్తదనాన్ని చూపించడమే కాకుండా, ఆడియన్స్‌కు సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇలాంటి క్రియేటివ్ అప్రోచ్, సినిమాను మరింత ప్రత్యేకంగా నిలబెట్టే అవకాశం ఉంది. ఇక సినిమా జూన్ 27న వరల్డ్ వైడ్ గా 20కి పైగా భాషల్లో విడుదల కాబోతోంది.