Begin typing your search above and press return to search.

బన్నీ వర్సెస్ చరణ్ ఫైట్ అక్కడ కూడా..?

చరణ్ కి ఇన్ స్టాగ్రాం లో 25 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంటే అల్లు అర్జున్ కన్నా ఒక 1.4 మిలియన్ ఫాలోవర్స్ తక్కువలో చరణ్ ఉన్నాడు.

By:  Tupaki Desk   |   15 Oct 2024 7:30 PM GMT
బన్నీ వర్సెస్ చరణ్ ఫైట్ అక్కడ కూడా..?
X

స్టార్ హీరోల మధ్య బాక్సాఫీస్ ఫైట్ చాలా కామన్. ఒక హీరో నెలకొల్పిన రికార్డులను మరో హీరో బ్రేక్ చేయాలని అనుకోవడం కామన్. ఐతే ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోల మధ్య కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ సినిమాల వరకే అని స్టార్స్ అనుకున్నా ఫ్యాన్స్ మాత్రం దాన్ని చాలా పర్సనల్ గా తీసుకుంటారు. ఇక సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐతే హీరోల సినిమాలు, కలెక్షన్స్ వీటితో పాటు కొత్తగా సోషల్ మీడియా ఫాలోవర్స్ లో కూడా పోటీ పడుతున్నారు.

తెలుగు స్టార్స్ అంతా కూడా రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఉంటారు. ఇన్ స్టా గ్రాం లో ఎప్పటికప్పుడు తమ ఫ్యాన్స్ కి సినిమాలకు సంబందించిన అప్డేట్స్ ఇస్తుంటారు. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్స్ లో అల్లు అర్జున్ ఒక్కడే హైయ్యెస్ట్ ఫాలోవర్స్ ని కలిగి ఉన్నాడు. ఇన్ స్టాగ్రాం లో అల్లు అర్జున్ అత్యధికంగా 26.4 మిలియన్ ఫాలోవర్స్ తో టాప్ 1 గా కొనసాగుతున్నాడు.

ఐతే ఆ తర్వాత ప్లేస్ లో రామ్ చరణ్ ఉన్నాడు. చరణ్ కి ఇన్ స్టాగ్రాం లో 25 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంటే అల్లు అర్జున్ కన్నా ఒక 1.4 మిలియన్ ఫాలోవర్స్ తక్కువలో చరణ్ ఉన్నాడు. ఇక ఈ లిస్ట్ లో థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. విజయ్ కి ఇన్ స్టాగ్రాం లో 21.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలను సైతం వెనక్కి నెట్టి విజయ్ దేవరకొండ టాప్ 3 గా నిలిచాడు. ఇక ఈ లిస్ట్ లో నాల్గవ స్థానంలో ఉన్నాడు మహేష్ బాబు. 14.4 మిలియన్ ఫాలోవర్స్ తో సత్తా చాటుతున్నాడు.

ఇక మహేష్ తర్వాత బాహుబలి ప్రభాస్ 12.8 మిలియన్ ఫాలోవర్స్ తో కొనసాగుతున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో మిగతా తెలుగు స్టార్స్ కన్నా ప్రభాస్ కే ఎక్కువ క్రేజ్ ఉంది. కానీ ఇన్ స్టాగ్రాం ఫాలోవర్స్ లో మాత్రం అందరి కన్నా లాస్ట్ లో ఉన్నాడు ప్రభాస్. ప్రభాస్ ఒక్కడే ఇప్పటివరకు పాన్ ఇండియా స్టార్ గా వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్నాడు.