సంధ్య థియేటర్ ఘటనపై మరో క్లారిటీ ఇచ్చిన బన్నీ
ఆమె మరణంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన అల్లు అర్జున్ 25 లక్షలు సాయం కూడా ప్రకటించాడు.
By: Tupaki Desk | 8 Dec 2024 5:01 AM GMT'పుష్ప 2' ప్రీమియర్ షోకి సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మరణంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన అల్లు అర్జున్ 25 లక్షలు సాయం కూడా ప్రకటించాడు. అలాగే వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పారు. అయితే ఈ ఘటన వివాదాస్పదంగా మారడంతో సోషల్ మీడియాలో కొంతమంది విమర్శలు చేస్తున్నారు.
పోలీసులు కూడా ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. మహిళ చనిపోయిందని తెలిసిన కూడా అల్లు అర్జున్ థియేటర్ లో హ్యాపీగా సినిమా చూసుకున్నాడు అంటూ విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన 'పుష్ప 2' సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ ఈ ఇష్యూపై మరోసారి రియాక్ట్ అయ్యారు. గత 20 ఏళ్ళ నుంచి నా ప్రతి సినిమా రిలీజ్ కి ప్రీమియర్ లేదంటే మార్నింగ్ షో ఫ్యాన్స్ తో కలిసి థియేటర్స్ లో చూస్తున్నాను.
ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు. ఫస్ట్ టైం ఈ ఘటన గురించి తెలిసిన తర్వాత దిగ్బ్రాంతికి గురయ్యాను. సినిమా సెలబ్రేషన్స్ మూడ్ లో ఉండగా ఇలా ఒకరు చనిపోయారనే న్యూస్ తెలిసింది. ఒక్కసారి మా ఎనర్జీస్ డౌన్ అయిపోయాయి. సుకుమార్ చాలా ఎమోషనల్. ఆయన డిస్టర్బ్ అయ్యారు. ఆ ఘటన తెలిసిన తర్వాత కోలుకోవడానికి మాకు కొంత టైం పట్టింది. అలాగే సంధ్య థియేటర్ లో సినిమా చూడటానికి వెళ్లిన తర్వాత కొద్ది సేపటికి మా మేనేజర్ వచ్చి ప్రాబ్లమ్ అవుతుంది వెళ్లిపోండి అని చెప్పారు.
దీంతో సినిమా చూడకుండానే తిరిగి వచ్చేయడం జరిగింది. మరుసటి రోజు మహిళ చనిపోయిందని తెలిసింది. ఆ షాకింగ్ న్యూస్ విన్న తర్వాత దాని గురించి రెస్పాండ్ కావడానికి సైకలాజికల్ గా నాకు కొంచెం టైం పట్టింది. ఇలాంటివి జరిగినపుడు మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఇలాంటి ఘటనపై ఎలా రెస్పాండ్ అవ్వాలనేది అర్ధం చేసుకోవడానికి నేను టైం తీసుకుంటాను.
ఆమె లేని లోటుని మేము తిరిగి తీసుకురాలేము. కానీ ఏదో చిన్న సాయం. ఇది పరిహారం అని కూడా మేము అనుకోవడం లేదు. ఈ హడావిడి అంతా అయ్యాక టైం చూసుకొని నేను వారి ఇంటికి వెళ్లి వ్యక్తిగతంగా కలుస్తాను. అలాగే వారి ఫ్యామిలీకి అన్ని విధాలుగా అండగా ఉంటాను అని అల్లు అర్జున్ తెలిపారు. బన్నీ ఇలా స్టేజ్ పైన క్లారిటీ ఇవ్వడంతో పాటు ఘటనపైన సారీ కూడా చెప్పారు. దీంతో ఈ వివాదానికి ముగింపు పలికినట్లు అయ్యింది.