Begin typing your search above and press return to search.

అవన్నీ తూచ్.. బన్నీ నెక్స్ట్ డైరెక్టర్ ఫిక్స్

డిసెంబర్ 6వ తేదీన వరల్డ్ వైడ్ గా పుష్ప సీక్వెల్ తో సందడి చేయనున్నారు.

By:  Tupaki Desk   |   16 Sep 2024 12:49 PM GMT
అవన్నీ తూచ్.. బన్నీ నెక్స్ట్ డైరెక్టర్ ఫిక్స్
X

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప-2 మూవీతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. నాన్ స్టాప్ గా జరుగుతున్న షూటింగ్ కు తనదైన రీతిలో సపోర్ట్ చేస్తున్నారు. డిసెంబర్ 6వ తేదీన వరల్డ్ వైడ్ గా పుష్ప సీక్వెల్ తో సందడి చేయనున్నారు. పుష్పరాజ్ గా మరోసారి అలరించనున్నారు. ఇప్పటికే అస్సలు తగ్గేదేలే అంటూ సినిమాపై అటు ఆడియన్స్ లో.. ఇటు ఫ్యాన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ చేశారు.

ఇదంతా బాగానే ఉన్నా.. బన్నీ నెక్స్ట్ మూవీ ఏంటన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. మిగతా బడా హీరోలంతా వరుస సినిమాలు లైన్ లో పెడుతుంటే.. అల్లు అర్జున్ కొత్త చిత్రాల విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ రావడం లేదు. బోలెడు రూమర్స్ వస్తున్నా.. అఫీషియల్ గా ఒక్క అనౌన్స్మెంట్ కూడా ఇప్పటి వరకు రాలేదు. దీంతో అల్లు అర్జున్.. పుష్ప-2 తర్వాత ఏ డైరెక్టర్ తో వర్క్ చేస్తారన్నది బిగ్ సస్పెన్స్ గా మారింది.

పుష్ప-2 షూటింగ్ అయ్యాక.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తో బన్నీ సినిమా స్టార్ట్ చేయనున్నారని గతంలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అట్లీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని... ఇప్పటికే అనౌన్స్ చేసిన త్రివిక్రమ్ సినిమా చేయనున్నారని టాక్ వినిపించింది. రీసెంట్ గా అట్లీ సినిమానే మళ్లీ ఫిక్స్ అయిందని గుసగుసలు వినిపించాయి. గీతా ఆర్ట్స్, టీ సిరీస్ బ్యానర్లపై గ్రాండ్ గా అట్లీ, బన్నీ మూవీ రూపొందనుందని అన్నారు.

అయితే ఇప్పుడు బన్నీ నెక్స్ట్ మూవీ.. తనకు ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన త్రివిక్రమ్ తోనే ఫిక్స్ అయిందని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారం. అందుకు పక్కా ప్లాన్ వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్- త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కంప్లీట్ గా ఫిక్స్ అయిందని.. ఇప్పటి వరకు వచ్చిన వార్తలు తూచ్ అని చెబుతున్నారు.

కాగా, అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోకి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. వారి కాంబినేషన్ లో ఇప్పటికే వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు వీరిద్దరూ కలిసి నాలుగో సినిమా కోసం వర్క్ చేయనున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానున్న ఆ మూవీ.. మైథలాజికల్ టచ్ తో రాబోతున్నట్లు తెలుస్తోంది. మరి బన్నీ, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.