Begin typing your search above and press return to search.

విషెస్ వ‌ర‌కూ వ‌చ్చారంటే..వారిద్ద‌రు క్లోజ్ అయిన‌ట్లే!

బ‌న్నీ త‌న ఇన్ స్ట్రా గ్రామా ఖాతా ద్వారా విషెస్ తెలియ‌జేసారు.

By:  Tupaki Desk   |   27 Oct 2024 11:25 AM GMT
విషెస్ వ‌ర‌కూ వ‌చ్చారంటే..వారిద్ద‌రు క్లోజ్ అయిన‌ట్లే!
X

మాజీ ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్‌ పుట్టినరోజు నేడు. ఈ నేప‌థ్యంలో అభిమానులంతా సోష‌ల్ మీడియా వేదిక‌గా వార్న‌ర్ కి విషెస్ తెలియ‌జేస్తున్నారు. క్రీడ రంగానికి చెందిన ప్ర‌ముఖులతో పాటు అంతా శుభాకాంక‌క్ష‌లు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా వార్నర్ కి ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. బ‌న్నీ త‌న ఇన్ స్ట్రా గ్రామా ఖాతా ద్వారా విషెస్ తెలియ‌జేసారు.


`మీరు కోరుకున్నవన్నీ దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను` అంటూ అల్లు అర్జున్ రాసుకోచ్చారు. ఆ పోస్ట్ చూసిన వార్న‌ర్ వెంట‌నే స్పందించారు. ఆయ‌న ఇలా రిప్లై ఇచ్చారు. `ధ‌న్యావాదాలు అల్లు అర్జున్ గారు. పుష్ప 2 కోసం వెయిట్ చేస్తున్నా` అంటూ రాసుకోచ్చారు. అలా ఇద్ద‌రు మంచి ప్రెండ్స్ అయిపోయారు. `పుష్ప ది రైజ్` అంత‌ర్జాతీయ స్థాయికి రీచ్ అయిందంటే? అందులో ప్ర‌ధాన కార‌ణం డేవిడ్ వార్నర్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

ఆ సినిమా పాట‌ల‌కు వార్న‌ర్ రీల్స్ చేయ‌డంతో? ప్ర‌ప‌చం దేశాల్లోనే ఆవీడియోలు వైర‌ల్ అయ్యాయి. అస‌లే వ‌ర‌ల్డ్ వైడ్ క్రికెట్ అభిమానులు ఎక్కువ‌. అందులోనూ వార్న‌ర్ వింధ్వ‌స‌క‌ర ఓపెన‌ర్. అత‌డికి సోష‌ల్ మీడిఖాతాల‌కు వీప‌రీ త‌మైన ఫాలోయింగ్ ఉంది. అత‌డి ఖాతా నుంచి ఏది రిలీజ్ అయినా అది క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతుంది. అలా బ‌న్నీ పాట‌ల వీడియోలు కూడా బాగా వైర‌ల్ అయ్యాయి. అత‌డిని చూసి మ‌రింత మంది క్రికెట‌ర్లు కూడా పుష్ప పాట‌ల‌కు రీల్స్ చేయ‌డంతో మ‌రింత సంచ‌ల‌న‌మైంది.

అలా బ‌న్నీ-వార్న‌ర్ స్నేహం మొద‌లైంది. నేడు వార్న‌ర్ కి విషెస్ చెప్పే వ‌ర‌కూ వ‌చ్చింది. ఇక పుష్ప‌-2 డిసెంబ‌ర్ 5న రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. భారీ అంచ‌నాల మ‌ధ్య సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్ప‌టికే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. వ‌ర‌ల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అవుతోన్న తొలి తెలుగు సినిమా కూడా ఇదే.