ర్యాష్ డ్రైవింగ్‌పై నిర్మాత బన్ని వాస్ ఫిర్యాదు
హైదరాబాద్ టి - హబ్ ప్రాంతంలో దీపావళి రోజు రేసర్ల హల్ చల్ గురించి ఇప్పుడు నగర వీసీ సజ్జనార్ కి, ట్రాఫిక్ పోలీస్ కి సోషల్ మీడియాల ద్వారా ఫిర్యాదు చేసారు బన్ని.
By: Tupaki Desk | 3 Nov 2024 3:30 PM GMTహైదరాబాద్ నగరంలో ఆకతాయిల బైక్ రేసింగుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మిడ్ నైట్ లో రేసర్లు బెట్టింగులతో చెలరేగుతూ పబ్లిక్ రోడ్లపై ఇతరులను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారనే తీవ్ర ఆరోపణలున్నాయి. ఎప్పటికప్పుడు పోలీసులు అలాంటి వారిని పట్టుకుని శిక్షలు విధిస్తున్నా యథా రాజా..! అన్న చందంగానే ఈ తంతు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది.
రెప్ప పాటులో రోడ్ పై మటుమాయం అయ్యే రేసర్లు ఎంతటి ప్రమాదకారులో చాలామంది అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు. ఇలాంటి అనుభవం టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు కూడా ఎదుర్కొన్నారు. హైదరాబాద్ టి - హబ్ ప్రాంతంలో దీపావళి రోజు రేసర్ల హల్ చల్ గురించి ఇప్పుడు నగర వీసీ సజ్జనార్ కి, ట్రాఫిక్ పోలీస్ కి సోషల్ మీడియాల ద్వారా ఫిర్యాదు చేసారు బన్ని. ఆయన మిడ్ నైట్ లో సాగిన రేసింగ్ వీడియో(ఈనాడు సౌజన్యం)ను ఇన్ స్టాలో షేర్ చేసి దానిని నగర పోలీస్ కి ట్యాగ్ చేసారు. కింది విధంగా ఫిర్యాదులో రాసారు.
అదే T హబ్ ప్రాంతం చుట్టూ దీపావళి నాడు అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంటికి వెళుతున్నప్పుడు దుర్మార్గులు నిర్లక్ష్యపు బైక్ స్టంట్‌లను నేను చూశాను .ముఖ్యంగా చేతిలో బాణసంచా పేలుస్తూ..వికృతంగా డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే ప్రమాదకరమైన ముప్పు దిగ్భ్రాంతిని కలిగించింది. T-హబ్ , అలాగే మైహోమ్ భూజా సమీపంలో ఇది రెగ్యులర్ గా జరుగుతుంది. అర్ధరాత్రి తర్వాత ఈ ప్రాంతాలను ప్రమాదకరమైన విన్యాసాలకు హాట్‌స్పాట్‌లుగా మారుతున్నాయి. ప్రతి ఒక్కరి భద్రతకు ఇది తీవ్ర ఇబ్బందికరంగా ఉందని నేను భావిస్తున్నాను. ఇది నిజంగా బాధాకరం.. అని బన్నీ వాసు రాసారు. @సజ్జనార్‌విసి, @tgsrtcmdoffice , @CYBTRAFFIC, @హైడ్‌సిటీపోలీస్.. లకు దీనిని ట్యాగ్ చేసారు.