Begin typing your search above and press return to search.

బన్నీ మార్కెట్.. పదేళ్ల కష్టం!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. రీసెంట్ గా పుష్ప 2: ది రూల్ మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 Feb 2025 7:59 AM GMT
బన్నీ మార్కెట్.. పదేళ్ల కష్టం!
X

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. రీసెంట్ గా పుష్ప 2: ది రూల్ మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. జీనియస్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. భారీ విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో వసూళ్లను రాబట్టి.. అనేక రికార్డులు బ్రేక్ చేసింది.

అయితే పుష్ప-2కు సౌత్ కన్నా నార్త్ లో ఎక్కువ వసూళ్లు వచ్చాయి. బాలీవుడ్ లో హైయెస్ట్ వసూళ్లను రాబట్టిన ఇండియన్ మూవీగా నిలిచింది. అంతే కాదు.. పుష్ప 2తో అల్లు అర్జున్ కు బీటౌన్ లో మంచి ఫ్యాన్ బేస్ తో పాటు క్రేజ్ కూడా పెరిగింది. ఇప్పుడు హిందీలో బన్నీ స్ట్రైట్ సినిమా చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.

ఏదేమైనా.. అల్లు అర్జున్ హిందీ మార్కెట్ భారీగా పెరిగిపోయింది. దాని వెనుక ఆయన పదేళ్ల కష్టం ఉందట! ఆ విషయాన్ని నిర్మాత బన్నీ వాసు.. రీసెంట్ గా తెలిపారు. దాదాపు 10-15 సంవత్సరాలుగా అల్లు అర్జున్ తన చిత్రాలను హిందీలో విడుదల చేస్తున్నారని.. అది కూడా పరిస్థితులతో సంబంధం లేకుండా అని చెప్పారు.

చిన్నగా విడుదలైనా, లేదా తక్కువ హిందీ థియేటర్లలో వసూళ్లు వచ్చినా, టికెట్ రేట్లు తక్కువ ఉన్నా.. ఏమైనా ఎప్పుడైనా తన చిత్రాలను హిందీ బెల్ట్‌ లో విడుదల చేయాలని పట్టుబట్టేవారని బన్నీ వాసు తెలిపారు. అలా మూవీ రిజల్ట్ తో సంబంధం లేకుండా.. అల్లు అర్జున్ నార్త్ లో ఫేమస్ అవ్వాలని కోరుకున్నట్లు చెప్పారు.

పుష్పతో దశాబ్దం తర్వాత ఇది చివరికి ఫలించిందని పేర్కొన్నారు. ముందు చిత్రాల కన్నా ఇప్పుడు ఆయనను ఆదిరిస్తున్న తీరు వేరే లెవెల్ అని తెలిపారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో బన్నీ ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని తమ హీరో అందుకున్నారని చెబుతున్నారు.

అయితే ఇప్పుడు అంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. చాలా మంది హీరోలు తమ సినిమాలను నార్త్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు. అక్కడ కూడా అలరించాలని చూస్తున్నారు. కానీ బన్నీ మాత్రం చాలా ఏళ్ల క్రితం నుంచే బీ టౌన్ లో తన చిత్రాలను విడుదల చేస్తున్నారు. ఇప్పుడు పదేళ్ల తర్వాత పుష్పతో తన మార్కెట్ ను అక్కడ వేరే లెవెల్ లో పెంచుకున్నారు. ఫ్యూచర్ లో ఇంకా విస్తరించాలని ప్లాన్ చేస్తున్నారేమో చూడాలి,.