మరోసారి ఆర్టీసీ బస్‌లో పైరసీ.. తండేల్ నిర్మాత ఆవేదన
బస్‌లో పైరసీ సినిమాని వీక్షిస్తుండగా ఆ వీడియోని షేర్ చేసిన నిర్మాత బన్నీ వాస్ తన X ఖాతాలో సంబంధిత అధికారులకు సమాచారం అందించారు.
By: Tupaki Desk | 12 Feb 2025 4:01 AM GMTనాగ చైతన్య- సాయిపల్లవి జంటగా చందు మొండేటి తెరకెక్కించిన `తండేల్` థియేటర్లలో అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. తండేల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరిచినా పైరసీ కారణంగా నష్టపోవాల్సి వస్తోంది. ఈ చిత్రం హెచ్‌డి వీడియో ప్రారంభ రోజునే ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం కలకలం రేపగా, ఇప్పుడు పైరసీ ని ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)కి చెందిన బస్సుల్లో ప్రివ్యూలు వేయడంపై నిర్మాత బన్ని వాస్ సీరియస్ గా ఉన్నారు.
బస్‌లో పైరసీ సినిమాని వీక్షిస్తుండగా ఆ వీడియోని షేర్ చేసిన నిర్మాత బన్నీ వాస్ తన X ఖాతాలో సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. సోమ, మంగళవారాల్లో వరుసగా ఆర్టీసీ బస్‌లో తండేల్ పైరసీ వెర్షన్ ని వీక్షిస్తున్న వీడియోలను బన్ని వాస్ తన X పేజీలో పోస్ట్ చేశారు. ``APSRTC బస్సు (సర్వీస్ నంబర్: 3066) మా థండేల్ పైరేటెడ్ వెర్షన్‌ను ప్లే చేసిందని వే 2 న్యూస్ ద్వారా తెలుసుకున్నాము. పబ్లిక్ బస్సులో పైరేటెడ్ వెర్షన్‌ను ప్లే చేయడం చట్టవిరుద్ధం.. దారుణం మాత్రమే కాదు.. ఈ చిత్రానికి ప్రాణం పోసేందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన లెక్కలేనంత మంది వ్యక్తులను తీవ్రంగా అవమానించడం కూడా`` అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. APSRTC చైర్మన్ #కోనకళ్ల నారాయణరావును ఆర్టీసీ బస్సుల్లో పైరసీ సినిమాలు ప్రదర్శించకుండా నిలువరించాల్సిందిగా బన్ని వాస్ అభ్యర్థించారు.
సోమవారం ఈ విజ్ఞప్తి చేసాక కూడా, మరుసటి రోజు మరో ఆర్టీసీ బస్ లో అదే సీన్ రిపీటైంది. మంగళవారం నాడు మరోసారి ఆర్టీసీ బస్ లో పైరసీ వెర్షన్ వీక్షిస్తున్న వీడియోను కూడా బన్ని వాస్ షేర్ చేసారు. ``మరోసారి ఏపిఎస్ ఆర్టీసీలో మా #తండేల్ పైరేటెడ్ వెర్షన్ వీక్షిస్తున్నార``ని బన్ని వాస్ ఆవేదన వ్యక్తం చేసారు. ఆయన ఎక్స్ ఖాతాలో ఇలా రాసారు. ఆర్టీసీ బస్సులో (వాహన సంఖ్య: AP 39 WB. 5566) తండేల్ ని ప్రదర్శించారు. పైరసీ చిత్ర పరిశ్రమకు హాని కలిగిస్తుంది. సృష్టికర్తల కృషిని అగౌరవపరుస్తుంది. APSRTC చైర్మన్ #కోనకళ్ల నారాయణరావు గారు, రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సులలో పైరేటెడ్ సినిమా ఫుటేజ్‌లను ప్రదర్శించడాన్ని నిషేధిస్తూ కఠినమైన సర్క్యులర్ జారీ చేసారని తెలుసుకోండి`` అని బన్ని వాస్ రాసారు. `తండేల్` విడుదలైన 5రోజుల్లోనే 50 కోట్ల క్లబ్ వైపు ప్రయాణిస్తోందని, నాగచైతన్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అందుకుందని ప్రఖ్యాత టైమ్స్ తన కథనంలో పేర్కొంది.