Begin typing your search above and press return to search.

రీమేక్ ల‌కు కాలం చెల్లిన‌ట్లే అంటోన్న నిర్మాత‌!

హిందీ సినిమా తెలుగులో రీమేక్ అవుతుంది. మాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలు కూడా ఎక్కువ‌గా తెలుగులో రీమేక్ అవుతుంటాయి.

By:  Tupaki Desk   |   4 March 2025 7:00 AM IST
రీమేక్ ల‌కు కాలం చెల్లిన‌ట్లే అంటోన్న నిర్మాత‌!
X

హిట్ సినిమాల‌ను రీమేక్ చేయ‌డం అన్న‌ది అన్ని భాష‌ల్లో ఉన్న‌దే. భాష‌తో సంబంధం లేకుండా హిట్ సినిమాని స్థానిక భాష‌కు అనుగుణం గా రీమేక్ చేసి స‌క్సెస్లు అందుకుంటారు. ఇది ఎంతో కాలంగా అమలులో ఉన్న విధానం. తెలుగు సినిమా హిందీలో రీమేక్ అవుతుంది. హిందీ సినిమా తెలుగులో రీమేక్ అవుతుంది. మాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలు కూడా ఎక్కువ‌గా తెలుగులో రీమేక్ అవుతుంటాయి.

అయితే తెలుగు సినిమాలు పాన్ ఇండియాలో ఫేమ‌స్ అయిన త‌ర్వాత రీమేక్ ల హ‌వా కాస్త త‌గ్గింది అన్న‌ది వాస్త‌వం. తాజాగా ఈ రీమేక్ చిత్రాల గురించి నిర్మాత బ‌న్నీ వాస్ సంచ‌ల‌న విష‌యాన్ని వెల్ల‌డించారు. 'ఛావా' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసే అవ‌కాశం ఉందా? అంటూ ఓ ప్ర‌శ్న ఆయ‌న ముందుకు వెళ్లింది. అందుకు ఆయ‌న ఆస‌క్తిక‌ర స‌మాధానం చెప్పారు. 'ఇలాంటి మంచి సినిమాని రీమేక్ చేసే ధైర్యం నేను చేయ‌లేను.

ఇప్పుడున్న రోజుల్లో రీమేక్ ట్రెండ్ అన్న‌ది క‌నుమ‌రుగ‌వుతుంది. సినిమా రిలీజ్ అయిన రెండు నెల‌ల‌కే ఆ సినిమా ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది. అన్ని భాష‌ల్లో ఆ సినిమా అందుబాటులో ఉంటుంది. కాబ‌ట్టి భ‌విష్య‌త్ లో సినిమా రీమేక్ చేయ‌డం అన్న‌ది కుద‌ర‌క పోవ‌చ్చు' అని అన్నారు. ఇది నిజ‌మే . సినిమా హిట్ అయితే 6 నుంచి 8 వారాల త‌ర్వాత ఓటీటీ లో రిలీజ్ అవుతుంది. ఇది ఓటీటీ నిబంధ‌న‌.

ఒక‌వేళ ఫెయిలైతే రెండు వారాల‌కే స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది. అలాంట‌ప్పుడు సినిమాను రీమేక్ చేయ‌డం ఎలా సాధ్యం? సినిమా రీమేక్ అవ్వాలంటే ఆ హిట్ సినిమా ఓటీటీ బిజినెస్ కి వెళ్ల‌కూడ‌దు. కేవ‌లం థియేట్రిక‌ల్ గా రిలీజ్ అయిన సినిమాలే రీమేక్ కు అవ‌కాశం ఉంటుంది. కానీ ఓటీటీ బిజినెస్ ని ఏ నిర్మాత వ‌దులుకుంటాడు. అలా చేయాలంటే నిర్మాత ధైర్యం చేయాలి. ఓటీటీ కంటే అద‌నంగా రీమేక్ రైట్స్ రూపంలో నిర్మాత‌కు ముట్టాలి.