Begin typing your search above and press return to search.

జనం కోసం 'ఆయ్' షేర్ కలెక్షన్స్

కమర్షియల్ సినిమాల పోటీని తట్టుకొని ఆయ్ మూవీ సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో 15 రోజులు పూర్తి చేసుకుంది.

By:  Tupaki Desk   |   2 Sep 2024 10:58 AM GMT
జనం కోసం ఆయ్ షేర్ కలెక్షన్స్
X

గత నెల ఇండిపెండెంట్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఆయ్ మూవీ సూపర్ సక్సెస్ అందుకొని థియేటర్స్ లో మంచి వసూళ్లు అందుకుంది. నార్నె నితిన్ హీరోగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాస్ నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రంతో అంజి కె మణిపుత్ర దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కమర్షియల్ సినిమాల పోటీని తట్టుకొని ఆయ్ మూవీ సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో 15 రోజులు పూర్తి చేసుకుంది.

ఇప్పటికి చాలా చోట్ల ఈ సినిమా థియేటర్స్ లో కొనసాగుతోంది. ఈ ఏడాది గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ కి ఆయ్ సినిమాతో సాలిడ్ సక్సెస్ లభించింది. ఇదిలా ఉంటే ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకల్ని పాలకొల్లులో నిర్వహించారు. దీనికి బన్నీ వాస్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలు నిర్వహించారు.

ఈ బర్త్ డే వేడుకలలో బన్నీ వాస్ మాట్లాడారు. ఆయ్ సినిమాకి ఇకపై వారం రోజుల వరకు వచ్చే కలెక్షన్స్ లో ప్రొడ్యూసర్ షేర్ నుంచి 25% శాతం వరద బాధితుల కోసం విరాళంగా ఇస్తానని అన్నారు. జనసేన పార్టీ ద్వారా ఈ విరాళం ప్రభుత్వానికి అందిస్తానని బన్నీ వాస్ ప్రకటించారు. బన్నీ వాస్ ప్రకటనపై అక్కడున్న జనసైనికులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఈ వేడుకలలో ఐ లవ్ పవన్ కళ్యాణ్, ఐ లవ్ పాలకొల్లు అని బన్నీ వాస్ అన్నారు.

బన్నీ వాస్ మాటలతో అక్కడున్న పవర్ స్టార్ అభిమానులు, జనసైనికులు కేకలు వేస్తూ సంతోషాన్ని తెలియజేశారు. ఇదిలా ఉంటే ఆయ్ మూవీ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 14.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. నార్నె నితిన్ కి ఈ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ హిట్ లభించింది. బన్నీ వాస్ ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో ఒక సక్సెస్ ని అందుకున్నారు. ఆయ్ సినిమాతో సెకండ్ హిట్ ని సొంతం చేసుకున్నారు.

ఈ ఏడాది గీతాఆర్ట్స్ 2 నుంచి తండేల్ మూవీ డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఏకంగా 80 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో ఈ మూవీ సిద్ధం అవుతోంది. సాయి పల్లవి తండేల్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.