Begin typing your search above and press return to search.

బన్నీ.. అక్కడేం చేస్తున్నాడు?

దీంతో పుష్ప-2 మూవీ షూటింగ్ రద్దు అయిందని, అల్లు అర్జున్ ఫారిన్ ట్రిప్ వెళ్లారని వార్తలు వచ్చాయి.

By:  Tupaki Desk   |   22 July 2024 5:31 AM GMT
బన్నీ.. అక్కడేం చేస్తున్నాడు?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ మధ్య మనస్పర్థలు వచ్చాయని రీసెంట్ గా చర్చ జరిగింది. అందుకే బన్నీ గెడ్డం తీయించేశారని టాక్ వినిపించింది. అదే సమయంలో ఫ్లైట్ లో బన్నీ బ్యాగ్ పెడుతున్న పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో పుష్ప-2 మూవీ షూటింగ్ రద్దు అయిందని, అల్లు అర్జున్ ఫారిన్ ట్రిప్ వెళ్లారని వార్తలు వచ్చాయి. కానీ అవేం నిజం కాదని బన్నీ టీమ్ క్లారిటీ ఇచ్చేసింది.

ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ సన్నిహితుడు, నిర్మాత బన్నీ వాస్ తన అప్ కమింగ్ మూవీ ఆయ్ ప్రెస్ మీట్ లో వివిధ రూమర్లపై స్పందించారు. సుకుమార్, బన్నీ మధ్య విబేధాలు వచ్చాయన్న వార్తలు కేవలం రూమర్లేనని తెలిపారు. తన ఫ్యామిలీతో కలిసి అల్లు అర్జున్.. హాలీడే టూర్ లో ఉన్నారని చెప్పారు. ఇటలీ వెళ్లారని పేర్కొన్నారు. స్పెయిన్ తోపాటు కొన్ని లొకేషన్స్ ను విజిట్ చేయడానికి బన్నీ వెళ్లినట్లు తెలుస్తోంది. గడ్డం తక్కువ ఉన్న అల్లు అర్జున్ పిక్స్, వీడియోస్ ఫ్లైట్ జర్నీలోనివేనట.

పుష్ప సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ షూటింగ్ పార్ట్ చాలా తక్కువ పెండింగ్ ఉందని లో తెలుస్తోంది. ప్రస్తుతం ఫహాద్ ఫాజిల్ పై సీన్స్ ను షూట్ చేస్తున్నారట. ఈ గ్యాప్ లో బన్నీ ట్రిప్ కు వెళ్లినట్లు సమాచారం. హాలిడే వెకేషన్ లో ఉన్న బన్నీ ఫ్యామిలీ.. ప్రస్తుతం నార్వేలో ఎంజాయ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన పిక్స్ ను బన్నీ సతీమణి స్నేహారెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు. పిక్ లో ఆమె ఒక్కరే ఉండగా.. బ్యూటిఫుల్ లొకేషన్ తో అదిరిపోయింది.

సముద్ర మట్టానికి 320+ మీటర్ల ఎత్తులో ఉన్న నార్వేజియన్ గ్రామీణ ప్రాంతాలను చూసి అల్లు అర్జున్ ఫ్యామిలీ ఫుల్ ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. రోడ్ ద్వారా వెళ్లి ట్రెక్కింగ్ చేసినట్లు ఇన్ సైడ్ టాక్. తన ఫ్రెండ్స్ తో కలిసి నార్వేజియన్ ఫ్జోర్డ్‌ లో ఫిషింగ్ కూడా చేశారని సమాచారం. మొత్తానికి కొన్ని నెలలుగా నాన్ స్టాప్ గా షూటింగ్ లో పాల్గొన్న బన్నీ.. ఇప్పుడు ఫ్యామిలీతో వెకేషన్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారన్నమాట.

అయితే వెకేషన్ నుంచి వచ్చాక.. ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో బన్నీ పుష్ప-2 సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇంతలో మళ్లీ గడ్డం పెరిగిపోతుంది. కాబట్టి షూటింగ్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ విషయం దృష్టిలో పెట్టుకున్న తర్వాతే.. బన్నీ ట్రిమ్ చేయించుకున్నారని ఫ్యాన్స్ అంటున్నారు. ఏదేమైనా గెడ్డం మ్యాటర్ ఫుల్ వైరల్ అయిపోయింది. ఇప్పుడు అందరికీ క్లారిటీ వచ్చేసింది.