Begin typing your search above and press return to search.

ఓటీటీ రిలీజ్ లపై బన్నీ వాస్ ఏమన్నారంటే?

తప్పంతా తమదేనని అన్నారు. ఓటీటీలో మీ ముందుకే నాలుగు వారాల్లో సినిమా వస్తుందని మేము చెప్పడం వలన ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చిన మూవీస్ చేయడం లేదని అన్నారు.

By:  Tupaki Desk   |   18 Aug 2024 7:54 AM GMT
ఓటీటీ రిలీజ్ లపై బన్నీ వాస్ ఏమన్నారంటే?
X

టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ రేట్ ఉన్న నిర్మాతలలో బన్నీ వాస్ ఒకరుగా ఉన్నారు. ఆయన మినిమమ్ బడ్జెట్ లతోనే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ ద్వారా మూవీస్ నిర్మిస్తూ ఉంటారు. ఈ ప్రొడక్షన్ వచ్చిన సినిమాలలో మేగ్జిమమ్ కమర్షియల్ హిట్స్ అయ్యాయి. ఆగష్టు 15న బన్నీ వాస్ నిర్మాతగా ఆయ్ మూవీ థియేటర్స్ లోకి వచ్చింది. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో డే బై డే కలెక్షన్స్ కూడా పెరుగుతున్నాయి. ఈ వీక్ లో టాలీవుడ్ బాక్సాఫీస్ విన్నర్ గా “ఆయ్” మూవీ నిలిచిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

లాంగ్ రన్ లో ఈ చిత్రం మంచి లాభాలు అందుకోవడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా టాలీవుడ్ లో సినిమాల ఓటీటీ రిలీజ్ పై చర్చ నడుస్తోంది. మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి 3-4 వారాల్లోనే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. ఈ ప్రభావం థియేటర్స్ లో కలెక్షన్స్ పైన పడుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తాజాగా ఓ మూవీ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు ఈ విషయంపై స్పందించారు.

తప్పంతా తమదేనని అన్నారు. ఓటీటీలో మీ ముందుకే నాలుగు వారాల్లో సినిమా వస్తుందని మేము చెప్పడం వలన ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చిన మూవీస్ చేయడం లేదని అన్నారు. ఈ విధానం మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. బాలీవుడ్ లో నడుస్తున్నట్లు 8 వరాల విధానం అమల్లోకి వస్తే అప్పుడు థియేటర్స్ లో సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుందని అన్నారు. దిల్ రాజు వ్యాఖ్యలపై తాజాగా మీడియా ప్రతినిధులు నిర్మాత బన్నీ వాస్ ని ప్రశ్నించారు.

“ఆయ్” మూవీ ఫన్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ లో భాగంగా మీడియా మీట్ లో బన్నీ వాస్ ని దిల్ రాజు కామెంట్స్ పై మాట్లాడాలని అడిగారు. ఎవరు ఎన్ని బాధలు పడిన, ఏం మాట్లాడిన చిత్ర పరిశ్రమలో యూనిటీ చాలా ముఖ్యం. నిర్మాతలు, డిస్టిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కూర్చొని ఈ ఓటీటీ రిలీజ్ ఇష్యూ పరిష్కరించుకోవాలి. బాలీవుడ్ లో అమలు చేస్తున్న 8 వారల విధానం ఇక్కడ కూడా అమలు చేసినపుడు కచ్చితంగా అంతా దారిలోకి వస్తుంది. మరల థియేటర్స్ లో సినిమాలకి ప్రేక్షకాదరణ పెరుగుతుందని అన్నారు. ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చి సినిమా చూడాలంటే ఏదైనా ప్రత్యేకత ఉండాలి.

ఇప్పుడు వీకెండ్ హాలిడేస్ కలిసొచ్చాయి కాబట్టి ఆయ్ సినిమాకి 40-45 శాతం ఓపెనింగ్స్ వస్తున్నాయి. మామూలు రోజుల్లో అయితే సినిమాకి ఎంత ప్రమోషన్స్ చేసిన కూడా 20-25 శాతం మాత్రమే ఓపెనింగ్స్ వస్తాయి. కచ్చితంగా ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పించాలంటే సినిమా మూడ్ క్రియేట్ చేయాలి. మౌత్ టాక్ తో పిక్ అప్ అవ్వాలంటే కరెక్ట్ గా పబ్లిక్ అటెన్షన్ రావడానికి కనీసం మూడు వారాల సమయం పడుతుందని బన్నీ వాస్ అన్నారు. ఆ తరువాత ఎక్కువ కలెక్షన్స్ వచ్చిన కూడా అందులో నిర్మాతకి 35 శాతం, థియేటర్స్ వాళ్ళకి 65 శాతం వెళ్ళిపోతుంది. ఇందులో నిర్మాతలకి మిగిలేది ఏమీ ఉండదు. అందుకే విధానపరమైన నిర్ణయాలపై అందరి కలిసి కూర్చొని చర్చించుకోవాల్సిన అవసరం ఉందని బన్నీ వాస్ అన్నారు.