Begin typing your search above and press return to search.

బన్నీ వాస్ బాక్సాఫీస్ లైనప్.. అస్సలు తగ్గట్లే..

గీతా ఆర్ట్స్ 2 ద్వారా బన్నీ వాస్ గత కొంతకాలంగా చిన్న బడ్జెట్ లో సినిమాలు చేస్తూ వస్తున్నారు.

By:  Tupaki Desk   |   23 Aug 2024 4:35 AM GMT
బన్నీ వాస్ బాక్సాఫీస్ లైనప్.. అస్సలు తగ్గట్లే..
X

గీతా ఆర్ట్స్ 2 ద్వారా బన్నీ వాస్ గత కొంతకాలంగా చిన్న బడ్జెట్ లో సినిమాలు చేస్తూ వస్తున్నారు. గీతా ఆర్ట్స్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉండగా గీతా ఆర్ట్స్ 2 నుంచి చిన్న హీరోలతో పాటు టైర్ 2 స్టార్స్ సినిమాలు వస్తున్నాయి. కంటెంట్ బేస్డ్ కథలకి బన్నీ వాస్ పెద్ద పీట వేస్తూ మూవీస్ చేస్తున్నారు. చాలా మంది కొత్త దర్శకులని టాలీవుడ్ కి పరిచయం చేశారు. స్టార్ క్యాస్టింగ్ లేకపోయిన కేవలం కంటెంట్ మీద నమ్మకంతోనే సినిమాలని థియేటర్స్ లోకి తీసుకొచ్చి సక్సెస్ లు అందుకుంటున్నాడు.

బన్నీ వాస్ నిర్మాతగా ఇప్పటి వరకు 15 సినిమాలు చేయగా అందులో మూడు సినిమాలు మాత్రమే కమర్షియల్ గా ఫెయిల్ అయ్యాయి. మిగిలిన చిత్రాలన్నీ కూడా హిట్ టాక్ సొంతం చేసుకొని గీతా ఆర్ట్స్ 2కి మంచి ప్రాఫిట్ తీసుకొని వచ్చాయి. ఇక చివరి 5 సినిమాలు చూసుకుంటే అన్ని కమర్షియల్ సక్సెస్ లే ఉండటం విశేషం. నిఖిల్ హీరోగా వచ్చిన 18 పేజెస్ మూవీ మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.

తరువాత కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన వినరో భాగ్యము విష్ణు కథ సూపర్ హిట్ అయ్యింది. శ్రీకాంత్ లీడ్ రోల్ లో వచ్చిన రీమేక్ మూవీ కోటబొమ్మాలి పీఎస్ కూడా బిజినెస్ పరంగా ప్రాఫిట్స్ అందించింది. సుహాస్ తో చేసిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ హిట్ బొమ్మగా నిలిచింది. తాజాగా ఆయ్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని బన్నీ వాస్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమాకి స్లో ఫేజ్ లో మూవీ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఫుల్ కామెడీతో ప్రేక్షకులకి వినోదాన్ని అందించిన చిత్రంగా ఈ మూవీ నిలిచింది.

నెక్స్ట్ గీతా ఆర్ట్స్ 2 నుంచి నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమా రానుంది. డిసెంబర్ 20న పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. గీతా ఆర్ట్స్ 2లో ఫస్ట్ హైయెస్ట్ బడ్జెట్ సినిమా ఇదే కావడం విశేషం. సుమారు 80 కోట్ల వరకు ఈ సినిమాపై బన్నీ వాస్ ఖర్చు చేస్తున్నారంట. సాయి పల్లవి ఈ చిత్రంలో లీడ్ రోల్ చేస్తోంది.

గీతా ఆర్ట్స్ 2 నుంచి వచ్చిన చివరి 5 సినిమాలు థీయాట్రికల్ గా మంచి లాభాలు తీసుకురావడంతో పాటు నాన్ థీయాట్రికల్ గా నిర్మాత బన్నీ వాస్ కి ప్రాఫిట్ అందించాయి. నెక్స్ట్ రాబోయే తండేల్ సినిమాపైనే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. రియలిస్టిక్ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమా కథని సిద్ధం చేశారు. కార్తికేయ 2 లాంటి సక్సెస్ తర్వాత చందూ మొండేటి చేస్తోన్న సినిమా కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ హైఎండ్ లోనే ఉన్నాయి. ఈ సినిమాపై బన్నీ వాస్ చాలా నమ్మకంగా ఉన్నారని చెప్పొచ్చు.