Begin typing your search above and press return to search.

కష్టం వచ్చినప్పుడు నా వెనక అతనుంటాడు..!

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మాతగా అంజి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఆయ్.

By:  Tupaki Desk   |   14 Aug 2024 4:17 AM GMT
కష్టం వచ్చినప్పుడు నా వెనక అతనుంటాడు..!
X

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మాతగా అంజి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఆయ్. నార్నే నితిన్ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా ఆగష్టు 15న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం జరిగింది. చిత్రయూనిట్ సమక్షంలో జరిగిన ఈ వేడుకకు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా అటెండ్ అయ్యారు. ఇక సినిమా గురించి నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ స్పీచ్ అదరగొట్టేశారు.

మైక్ అందుకున్న బన్నీ వాసు.. హీరో నార్నే నితిన్ గారు లేకపోతే ఈ సినిమా జరిగేది కాదని అన్నారు. ఇది ముగ్గురు కుర్రోళ్ల కథ.. ఎలాంటి సంకోచం లేకుండా సినిమా యాక్సెప్ట్ చేశారు. ఇది ఒక కథ కింద చూసి కథలో పార్ట్ అయినందుకు థ్యాంక్ యు అని అన్నారు బన్నీ వాసు. పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన్ను బాగా చూసుకోవాలని అనుకున్నా కానీ ఆయన సెట్ లో నన్ను బాగా బాధ్యతగా చూసుకున్నారని చెప్పారు.

ఆయ్ ట్రైలర్ ని పిఠాపురం లో చేయాలని అనుకున్నాం.. ఆ టైం లో నితిన్ గారి పర్మిషన్ స్కిప్ చేశాను. అర్రె జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ ఆల్రెడీ అనౌన్స్ చేశాం ఎలా అనుకుని ఆయనికి విషయం చెబితే ఆయన వాళ్ల బావ ఎన్టీఆర్ గారిని అడిగితే ఆయన సినిమాకు ఉపయోగ పడుతుంది అంటే చేసేయండి అన్నారట. ఒక విషయాన్ని సినిమా వరకే ఆలోచించగలడం చాలా పరిణితితో ఆలోచించారు దానికి చాలా థ్యాంక్స్ అని అన్నారు బన్నీ వాసు.

ఇక ఈవెంట్ కు వస్తుంటే కారులో జానీ సినిమాకు యానిమేటర్ గా వచ్చి ఈరోజు గీతా ఆర్ట్స్ నిర్మాత అయ్యాడని ఒక క్లిప్ చూసి ఒక్కసారి నా జీవితం మొత్తం కనిపించింది. పాలకొల్లు నుంచి ఒక సాదాసీదాగా వచ్చి యానిమేటర్ గా వచ్చిన నేను చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు ఏర్పరచుకున్న మహా వృక్షం కింద నిర్మాతగా మొదలు పెట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోని పెట్టి సినిమా తీశానంటే అంతా దేవుడు ఆశీర్వాదం.. చిన్నప్పటి నుంచి నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని.. ఆయన ఖుషి సినిమా తీసి నాన్న దగ్గర అంబాసిడర్ కార్ వేసుకుని హైదరాబాద్ వచ్చేశా.. ఈరోజు ఆయన రాజకీయ జీవితంలో ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్నా.. ఎంత అదృష్టం, పుణ్యం చేసుకుంటేనో ఇది జరుగుతుంది.

ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతున్నా ప్రమోషన్స్ సరిగా లేవని టీం అంతా అనుకుంటున్నాడు ఐతే నా లైఫ్ లో ఒకడున్నాడు.. నాకు అవసరం ఉంటే అతనొస్తాడు. ఈమధ్య మా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని కూడా రాసుకొచ్చారు. నేను కష్టంలో ఉంటే ఇద్దరు మాత్రమే గుర్తుపడతారు ఒకటి మా అమ్మ.. రెండు నా స్నేహితుడు బన్నీ.. నేను కమ్యునికేట్ చేయక్కర్లేదు.. నేను అడగక్కర్లేదు. నాకు అవసరం ఉంది అంటే అతను వచ్చి నిలబడతాడు. తన ట్విట్టర్ హ్యాండిల్ లో నేను అడగకుండానే వీడికి అవసరం అని వేశాడు. అది మంచి రీచ్ వచ్చిందని అనారు బన్నీ వాసు.

స్నేహితుడి కోసం ఎప్పుడు నిలబడాలో ఆయనకు తెలుసు. 20 ఏళ్ల క్రితం నేను చేసిన మిస్టేక్ కి గీతా ఆర్ట్స్ నుంచి వెళ్లిపోవాలి. కానీ ఆ టైంలోనే తను ఉంటున్నాడు.. తను ఉంటాడు అని నా ముందు నిలిచాడు బన్నీ.. ఆరోజు అలా బన్నీ నిలబడకపోతే ఈరోజు బన్నీ వాసు లేడు. నేను సంతోషంగా ఉన్నప్పుడు కన్నా బాధలో ఉన్నప్పుడు బన్నీ ఉన్నాడు. మేమిద్దరం ఎక్కడ ఉన్నా ఆయన బాగుండాలని కోరుతున్నానని అన్నారు బన్నీ వాసు.

సినిమా ఈవెంట్ కు శ్రీలీలను తీసుకు రావడం ఆమెలో ఉన్న ఎనర్జీ ఈ సినిమాలో కూడా ఉంటుంది. అందుకే ఆమెను పిలిచాం. షూటింగ్ లో బిజీగా ఉన్నా అడగ్గానే ఒప్పుకున్నదుకు థ్యాంక్స్ అని అన్నారు. బన్నీ వాసుయ్. నిఖిల్ భాయ్ కూడా ఫోన్ చేస్తే ఇది నా సినిమా నేను వస్తున్నా అని అన్నారు. ఎన్నింటికి రావాలి.. ఎక్కడికి రావాలి అని అడిగారు.. ఆయనకు థ్యాంక్ యు సోమచ్ అని చెప్పారు బన్నీ వాసు.

ఇక తను జాతిరత్నాలు చూసి ఇంటికెళ్లి కుళ్లు కున్నా.. నా లైఫ్ లో ఇంతమంచి ఎంటర్టైన్మెంట్ తీయలేదే అనుకున్నా.. మీ జాతిరత్నాల్లాంటి స్క్రీన్ ప్లే మీద నడిపించే సినిమా చూసే చాలా సినిమాలు వస్తున్నాయని అనుదీప్ గురించి చెప్పారు బన్నీ వాసు. మ్యాడ్ సినిమా కూడా బాగా నచ్చింది. ఆయ్ సినిమా కూడా అలానే నవ్విస్తుందని అన్నారు బన్నీ వాసు.