Begin typing your search above and press return to search.

'పుష్ప 2'.. రూమర్స్‌కు చెక్ పెట్టిన బన్నీ వాస్!

ఇంకా బన్నీ వాస్ మాట్లాడుతూ.. ''సుక్కూకి నాతో బన్నీతో ఒక స్పెషల్ బాండింగ్ ఉంటుంది. అది మాటల్లో చెప్పలేని ఎమోషన్. అది ఎప్పటికీ ఉంటుంది.

By:  Tupaki Desk   |   19 July 2024 2:18 PM GMT
పుష్ప 2.. రూమర్స్‌కు చెక్ పెట్టిన బన్నీ వాస్!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ''పుష్ప: ది రూల్''. గత కొన్ని రోజులుగా ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. బన్నీ-సుక్కూ మధ్య మనస్పర్థలు వచ్చాయని, అందుకే అల్లు అర్జున్ గడ్డం ట్రిమ్ చేసుకొని విదేశాలకు వెళ్లారని, ప్రస్తుతానికి షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారని.. ఇలా రకరకాల పుకార్లు చక్కర్లు కొట్టాయి. దీంతో అసలు ఈ క్రేజీ ప్రాజెక్ట్ విషయంలో ఏం జరుగుతుందో అని అభిమానులు ఆందోళన చెందారు. ఈ నేపథంలో అల్లు ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన నిర్మాత బన్నీ వాస్ తాజాగా ఈ రూమర్స్ పై స్పందించారు.

'ఆయ్‌' సినిమా ప్రెస్‌మీట్‌లో బన్నీ వాస్ మాట్లాడుతూ.. అల్లు అర్జున్, సుకుమార్ మధ్య విబేధాలు వచ్చాయనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని, 'పుష్ప-2' గురించి వస్తున్న వార్తలు చూసి తాము నవ్వుకునే స్థితిలో ఉన్నామని అన్నారు. ''బన్నీ, సుకుమార్, నిర్మాతల తరువాత లోపల ఏం జరుగుతుందనేది తెలిసేది అత్యంత సన్నిహితంగా ఉండే నాకే. ఇటీవల పుష్ప-2 గురించిన రెండు మూడు ఆర్టికల్స్ మా ఫ్రెండ్ పంపితే చదివాను. మేమంతా ఆ ఆర్టికల్స్ చూసి నవ్వుకున్నాం. మాకు ఫ్రీగా చాలా పబ్లిసిటీ దొరుకుతోంది. దాన్ని అలాగే పోనివ్వని అనుకున్నాం. అల్లు అర్జున్ వర్క్ కేవలం 15-17 రోజులు మాత్రమే ఉంది. ఆయన మీద క్లైమాక్స్ సన్నివేశాలు, ఒక సాంగ్ షూటింగ్ పూర్తి చెయ్యాలి అంతే. ఆయనకు సంబంధించిన మిగతా షూటింగ్ అంతా అయిపోయింది. ఫహద్ ఫాజిల్ ది ఎక్కువ పెండింగ్ వర్క్ ఉంది. ఏప్రిల్ మేలో ఆయన డేట్స్ క్యాన్సిల్ అయ్యాయి'' అని బన్నీ వాస్ తెలిపారు.

''ఇప్పుడు క్లైమాక్స్ చేసేసిన తర్వాత మళ్ళీ ఏమైనా షూట్ చెయ్యాలంటే గడ్డం అనేది పెద్ద సమస్య అవుతుంది కాబట్టి, ముందుగా ఫస్టాఫ్ ను ఎడిట్ చెయ్యాలని సుకుమార్ భావించారు. ఆ తర్వాత క్లైమాక్స్, సాంగ్ షూట్ ఒకేసారి పెట్టుకుందామని ఆయన అనుకున్నారు. ఈలోగా ఫహద్ డేట్స్ కూడా ఉన్నాయి.. ఆయన వర్క్ ఫినిష్ చెయ్యాలి. దానికి 30-35 రోజుల గ్యాప్ దొరకడంతో, బన్నీ తన ఫ్యామిలీతో ఇటలీకి వెళ్ళడానికి కరెక్ట్ గా అన్నీ లెక్కలు వేసుకొని గడ్డం ట్రిమ్ చేసుకున్నారు. దాన్ని అందరూ బీభత్సం చేసారు. ఎవరు ఎన్ని అనుకున్నా ఇదే నిజం'' అని 'పుష్ప-2' గురించి వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు బన్నీ వాస్.

ఇంకా బన్నీ వాస్ మాట్లాడుతూ.. ''సుక్కూకి నాతో బన్నీతో ఒక స్పెషల్ బాండింగ్ ఉంటుంది. అది మాటల్లో చెప్పలేని ఎమోషన్. అది ఎప్పటికీ ఉంటుంది. సుకుమార్ ఇంకో 6 నెలలు షూటింగ్ చేస్తానన్నా బన్నీ వెళ్తారు. ఎందుకంటే పుష్ప అనేది వాళ్ళిద్దరి లైఫ్ లో ఎలాంటి రిమార్కబుల్ ప్రాజెక్ట్, దాని వేల్యూ ఏంటనేది తెలియకుండా ఇక్కడి దాకా రారు. ఇన్నేళ్ళుగా జర్నీ చేస్తున్నారు. వాళ్లిద్దరూ చిన్న పిల్లలేమీ కాదు. ఇప్పుడు ఏవైతే రూమర్స్ వస్తున్నాయో.. ఇవన్నీ మీరు రాసుకోడానికి బాగానే ఉంటుంది కానీ, నిజానికి ఇన్సైడ్ వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఎవరి పనుల్లో వారున్నారు. మేము అసలు వాటిని పట్టించుకోవడం లేదు. నాకు తెలిసి ఆగస్టు ఫస్ట్ వీక్ లో ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది'' అని తెలిపారు.

అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో 2021 చివర్లో వచ్చిన బ్లాక్ బస్టర్ 'పుష్ప: ది రైజ్' కు రెండో భాగంగా 'పుష్ప: ది రూల్' మూవీ తెరకెక్కుతోంది. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. ఫహాద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, సునీల్, జగదీష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రాబోతున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. 'పుష్ప 2' చిత్రాన్ని 2024 డిసెంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేయనున్నారు.