Begin typing your search above and press return to search.

'బిజినెస్‌ మెన్‌' పెద్ద ప్లానే..!

ఆగస్టు 9వ తారీకున తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్‌ మెన్ ను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   29 July 2023 5:33 AM GMT
బిజినెస్‌ మెన్‌ పెద్ద ప్లానే..!
X

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు ఆగస్టు 9న పుట్టిన రోజు జరుపుకోబోతున్న విషయం తెల్సిందే. మహేష్ బాబు ప్రతి పుట్టిన రోజు ను ఆయన కంటే ఆయన అభిమానులు పెద్ద ఎత్తున జరుపుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో స్టార్స్ పుట్టిన రోజు అనగానే రీ రిలీజ్ లు గుర్తుకు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ప్రస్తుతం మహేష్ బాబు 'బిజినెస్ మెన్‌' ప్రచారం జోరుగా సాగుతోంది.

మహేష్‌ బాబు నటించిన అన్ని చిత్రాల్లోకి బిజినెస్ మెన్‌ చాలా ప్రత్యేకమైనది అనడంలో సందేహం లేదు. హీరోగా ఆయనకు బిజినెస్‌ మెన్ కమర్షియల్‌ గా బిగ్గెస్ట్‌ హిట్ కాకున్నా కూడా ఆ సినిమా చాలా తక్కువ రోజుల్లో పూర్తి అయి ఒక ట్రెండ్‌ సెట్టర్‌ మూవీగా నిలిచింది. అలాంటి సినిమా రీ రిలీజ్ కు రెడీ అయింది.

ఆగస్టు 9వ తారీకున తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్‌ మెన్ ను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వం లో రూపొందిన బిజినెస్‌ మెన్‌ సినిమా అప్పట్లో సంచలనం అనడంలో సందేహం లేదు. అలాంటి సినిమాను ఇప్పడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న నేపథ్యంలో కచ్చితంగా భారీ వసూళ్లు సాధ్యం అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మహేష్ బాబు ఫ్యాన్స్‌ గతంలో పోకిరి సినిమా తో భారీ వసూళ్ల రికార్డు ను నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు రీ రిలీజ్ రికార్డులు అన్నింటిని కూడా బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు. అందుకోసం వారు సోషల్‌ మీడియాలో ప్రచారం మొదలుకుని అనేక విధాలుగా సినిమాను ప్రమోట్‌ చేస్తున్నారు. కనుక ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఆ రోజు భారీ ఎత్తున సినిమాను చూసేందుకు థియేటర్ల ముందు క్యూ కట్టే అవకాశం ఉంది.

బిజినెస్ మెన్ సినిమా లో మహేష్ బాబు కు జోడీగా కాజల్ అగర్వాల్‌ నటించింది. ప్రకాష్ రాజ్, నాజర్‌, ధర్మవరపు సుబ్రమణ్యం కీలక పాత్రల్లో నటించారు. ఆర్ ఆర్‌ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా మహేష్ బాబు కెరీర్‌ లో అతి తక్కువ రోజుల్లో రూపొందిన చిత్రంగా ఈ చిత్రం రికార్డు సాధించింది.