Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: బుట్ట బొమ్మ చీరందం

ప‌సుపు రంగు చీర‌లో పూజా హెగ్డే అందం యువ‌త‌రం గుండెల్లో గుబులు పెంచుతోంది.

By:  Tupaki Desk   |   18 Feb 2024 9:42 AM GMT
ఫోటో స్టోరి: బుట్ట బొమ్మ చీరందం
X

నుదుటిన పాపిడి బొట్టు.. మెడ‌లో ప‌చ్చ‌ల హారం.. జ‌డ‌లో మ‌ల్లెల చెండు.. స‌న్న‌జాజి న‌డుముకు అంద‌మైన వ‌డ్డానం.. ప‌సుపు రంగు కోకా ర‌వికెలో.. ఈ అంద‌మైన అమ్మాయి వేష‌ధార‌ణ చూస్తుంటే మ‌తి చెడ‌కుండా ఉంటుందా? చూడ‌గానే బుట్ట‌బొమ్మ అని పొగిడేయ‌కుండా ఉండ‌గ‌ల‌రా?


ప‌సుపు రంగు చీర‌లో పూజా హెగ్డే అందం యువ‌త‌రం గుండెల్లో గుబులు పెంచుతోంది. ఇక కొన్ని ఫోటోల్లో బ్యాక్ లెస్ ఫోజుల‌తో మ‌రింత‌గా అగ్గి రాజేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.


పూజా హెగ్డే ఇటీవల ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో వార్తల్లో నిలిచింది. ఇటీవ‌ల తెలుగు సినిమాల‌కు సంత‌కాలు చేయ‌డం లేద‌ని ప్ర‌చార‌మైంది. కానీ దానిని పూజా ఖండించింది. సంవత్సరాలుగా తన గురించి చాలా రాసార‌ని తెలిపింది. నేను ప్రైవేట్ జెట్ కొన్నానని కూడా ఎవరో రాశారు! మా అమ్మ అది చదివి అది నిజమేనా అని అడిగారు! అంటూ తేలిక‌గా న‌వ్వేసింది.


నేను సినిమాల గురించి ఉత్సాహంగా ఉంటేనే ఎంపిక చేసుకుంటాను.. ఎందుకంటే నన్ను సెట్స్‌కి బ‌లవంతంగా లాగడం ఇష్టం లేదు. ఒక కళాకారిణిగా, నేను విభిన్నమైన పనులు చేయడానికి ఇష్టపడతాను. ప్రేక్షకులను, అభిమానులను ఎగ్జ‌యిట్ చేసేలా ఏదైనా చేయాలనుకున్నాను. నేను కొన్ని కథనాలను విన్నాను కానీ అవి నాకు న‌చ్చ‌లేదు. ఎందుకంటే నా పాత్ర కథనంలో ముఖ్యమైనది కాదు లేదా కథ నా గురించి కాదు..కాబట్టి నేను వేచి ఉండి సరైన చిత్రాన్ని ఎంచుకుంటాను. అని తెలిపింది.