Begin typing your search above and press return to search.

ఈ ఆఫర్ నిజమైతే ప్రేమలు పాప దశ తిరిగినట్లే

VD12 వర్కింగ్ టైటిల్ తో రెడీ అవుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మమిత బైజుకి అవకాశం వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   12 May 2024 4:09 AM
ఈ ఆఫర్ నిజమైతే ప్రేమలు పాప దశ తిరిగినట్లే
X

ప్రేమలు సినిమాతో హీరోయిన్ గా అందరికి చేరువ అయిన మలయాళీ ముద్దుగుమ్మ మమత బైజు. ఈ సినిమా కంటే ముందు ఆమె పది చిత్రాలకు పైగా చేసింది. అందులో లీడ్ యాక్టర్ గా చేసిన మూవీస్ కూడా ఉన్నాయి. అయితే ప్రేమలు సినిమా మాత్రం మమిత ఇమేజ్ ని అమాంతం పెంచేసింది. ఈ సినిమా తెలుగులో డబ్బింగ్ అయ్యి రిలీజ్ అయింది. తెలుగు ఆడియన్స్ కి కూడా ప్రేమలు మూవీ విపరీతంగా కనెక్ట్ అయింది.

సినిమాలో మమత బైజు పెర్ఫామెన్స్ కి అందరూ ఫాన్స్ అయిపోయారు. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో మమత బైజుకి స్టార్ ఇమేజ్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ దర్శక నిర్మాతలు మమతని తెలుగులో ఇంటర్డ్యూస్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. చాలామంది ఆమెను సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా గౌతం తిన్ననూరి దర్శకత్వంలో మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

VD12 వర్కింగ్ టైటిల్ తో రెడీ అవుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మమిత బైజుకి అవకాశం వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ముందుగా ఈ మూవీలో టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా కన్ఫర్మ్ అయింది. అయితే ఆమె వరుస ఫెయిల్యూర్స్ నేపథ్యంలో విజయ్ దేవరకొండకి జోడిగా మరో హీరోయిన్ ని తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారంట.

అందులో భాగంగానే మమత బైజుని సంప్రదించినట్లు సమాచారం. ఇప్పటికే చాలా మంది మలయాళీ భామలు తెలుగు ఇండస్ట్రీని రూల్ చేస్తున్నారు. నిత్యా మీనన్, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ టాప్ స్టార్స్ గా ఉన్నారు. అలాగే రెగ్యులర్ గా మలయాళీ భామలు టాలీవుడ్ లోకి అడుగుపెట్టి తమ సత్తా చాటుతున్నారు.

ఇదే వరుసలో మమితబైజుకి టాలీవుడ్ లో జెండా పాతడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. VD12 సినిమాలో మమిత హీరోయిన్ గా చేయడానికి ఓకే చెప్పిందనే టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే టాలీవుడ్ లో కచ్చితంగా మమత బైజు దశ తిరిగినట్లే అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే కథలో హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా ముఖ్యమట.

నటిగా మరో స్థాయికి చేరడానికి అది చాలా హెల్ప్ అయ్యేలా మంచి ఏమోషన్ ఉంటుందని తెలుస్తోంది. దిల్ రాజు బ్యానర్ నుంచి మమితకి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ ప్రేమలు పిల్ల తెలుగు ఎంట్రీ కచ్చితంగా ఉంటుందనే ప్రచారం నడుస్తోంది. అయితే మొదటి అవకాశం ఏ హీరో పక్కన అందుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.