Begin typing your search above and press return to search.

కాల్ మీ బే ట్రైలర్: అన‌న్య‌పై బెస్ట్ ఫ్రెండ్స్ ప్ర‌శంస‌లు

మ‌రోవైపు వ్య‌క్తిగ‌త జీవితంలో ఆదిత్యారాయ్ నుంచి బ్రేక‌ప్ గురించి తెలిసిన‌దే.

By:  Tupaki Desk   |   20 Aug 2024 5:02 PM GMT
కాల్ మీ బే ట్రైలర్: అన‌న్య‌పై బెస్ట్ ఫ్రెండ్స్ ప్ర‌శంస‌లు
X

అనన్య పాండే లైగ‌ర్ చిత్రంతో సౌత్ కి ప‌రిచ‌య‌మైంది. ఆ సినిమా డిజాస్ట‌ర్ ఫ‌లితం నిరాశ‌ప‌రిచింది. సౌత్ లో ఘ‌న‌మైన ఆరంగేట్రం కోసం ప్ర‌య‌త్నించ‌గా.. సినిమా పెద్ద ఫ్లాప్ అయినందుకు నిరాశ చెందింది. మ‌రోవైపు వ్య‌క్తిగ‌త జీవితంలో ఆదిత్యారాయ్ నుంచి బ్రేక‌ప్ గురించి తెలిసిన‌దే.


ఇంత‌లోనే అన‌న్య న‌టించిన `కాల్ మి బే` విడుద‌ల‌కు వ‌స్తోంది. నేడు ట్రైలర్ విడుదలైంది. అభిమానుల్లోకి ఇది వైర‌ల్ గా దూసుకెళుతోంది. బెస్ట్ ఫ్రెండ్స్ సుహానా ఖాన్, షానాయ కపూర్, నవ్య నవేలి నందా, జాన్వీ కపూర్‌లు ఈ సిరీస్ వీక్ష‌ణ‌పై తమ ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. ఈ సిరీస్‌తో నే అన‌న్య పాండే డిజిటల్ అరంగేట్రం చేస్తోంది. ట్రైల‌ర్ విడుద‌ల కాగానే, అన‌న్య స్నేహితురాళ్లంతా ఫైర్ ఈమోజీల‌తో విరుచుకుప‌డ్డారు. అన‌న్య‌పై త‌మ ప్రేమ‌ను కురిపించారు.


`కాల్ మి బే` క‌థాంశం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఒక‌ రిచ్ కిడ్ మ‌ధ్య‌త‌ర‌గ‌తి అమ్మాయిగా ఉండాల్సి వ‌స్తే.. ఎలా ఉంటుంది? అన్నది ఫ‌న్ , హాస్యాన్ని జోడించి ఇందులో చూపిస్తున్నారు. ప‌రిస్థితుల ప్ర‌భావంతో ఇర్రిటేట్ అయ్యే అమ్మాయిగా అన‌న్య పాండే న‌టించింది. న్యూ ఢిల్లీలో సాంప్ర‌దాయ‌బ‌ద్ధ‌మైన‌ పెంపకం, జీవనశైలితో అనన్య పాత్ర క‌నిపిస్తుంది. అయితే అన‌న్య‌ మధ్యతరగతి ట్రామా కార‌ణంగా బ్యాంక్ ఖాతా కార్డ్‌లన్నీ తిరస్కరణ‌కు గుర‌వుతాయి. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో తెర‌పైనే చూడాల్సి ఉంటుంది.

అనన్య వెబ్ సిరీస్ ఈ సంవత్సరం మోస్ట్ అవైటెడ్ సిరీస్‌లలో ఒకటి. వీర్ దాస్, వరుణ్ సూద్, విహాన్ సమత్, ముస్క్కన్ జాఫేరి, నిహారిక లైరా దత్, లిసా మిశ్రా, మినీ మాథుర్ ఇందులో కీల‌క పాత్ర‌ధారులు. ఈ ధారావాహికను ఇషితా మోయిత్రా, సమీనా మోట్లేకర్, రోహిత్ నాయర్ రాశారు. ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా దీనిని నిర్మించారు.