Begin typing your search above and press return to search.

సంజ‌య్ ద‌త్ లా ద‌ర్శ‌న్ కూడా సీన్ లోకి!

ఛాలెంజింగ్ స్టార్ , క‌న్న‌డ న‌టుడు ద‌ర్శ‌న్ అరెస్ట్ తో ఆయ‌న చేయాల్సిన సినిమాలు డైల‌మాలో ప‌డిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   23 July 2024 5:30 AM GMT
సంజ‌య్ ద‌త్ లా ద‌ర్శ‌న్ కూడా సీన్ లోకి!
X

ఛాలెంజింగ్ స్టార్ , క‌న్న‌డ న‌టుడు ద‌ర్శ‌న్ అరెస్ట్ తో ఆయ‌న చేయాల్సిన సినిమాలు డైల‌మాలో ప‌డిన సంగ‌తి తెలిసిందే. ప్రారంభం కాని సినిమాల సంగ‌తి ప‌క్క‌నబెడితే ప్రారంభ‌మైన సినిమాల ప‌రిస్థితి ఆగ‌మ్య గోచ‌రంగా మారింది. అందులో ఒక‌టి `డైవిల్` చిత్రం. ద‌ర్శ‌న్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గానే హ‌త్య కేసులో అరెస్ట్ అయ్యాడు. ఈ సినిమాపై క‌న్న‌డ నాట భారీ అంచ‌నాలున్నాయి. దీంతో ఈ సినిమా ప‌రిస్థితి ఏంటి? అన్న అంశం తెర‌పైకి వ‌స్తుంది.

ద‌ర్శ‌న్ ఈ చిత్రాన్ని పూర్తిచేసే అవ‌కాశం ఉందా? లేదా? అన్న చ‌ర్చ సాగుతుంది. అయితే అందుకు ఛాన్స్ ఉంది. కానీ స‌మ‌యం పడుతుంద‌ని తెలుస్తుంది. గ‌తంలో బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ కూడా అరెస్ట్ అయి జైల్లో ఉన్న స‌మ‌యంలో పిరోల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చి పెండింగ్ షూటింగ్ ల ను పూర్తి చేసారు. ముంబై పేల్లుళ్ల కేసులో అరెస్ట్ అయిన సంజ‌య్ దత్ అప్ప‌టికే `జంజీర్`, `గిరి` చిత్రాలు చేస్తున్నాడు.

2013 లో కోర్టు ఇచ్చిన ప్ర‌త్యేక అనుమ‌తితో పిరోల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చి ఆ సినిమాల్ని పూర్తిచేసారు. ద‌ర్శ‌న్ ఇప్పుడు ఇదే విధానంలో `డెవిల్` షూటింగ్ పూర్తి చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అయితే అందుకు స‌మ‌యం ప‌డుతుందని న్యాయ‌వాదులు అంచ‌నా వేస్తున్నారు. సంజ‌య్ ద‌త్ కి శిక్ష ప‌డిన త‌ర్వాత ఆ సినిమాలు పూర్తి చేసాడు. కానీ ఇక్క‌డ ద‌ర్శ‌న్ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.

ఇంకా కోర్టులో ట్ర‌య‌ల్స్ మొద‌లవ్వ‌లేదు. పోలీసులు ఛార్జ్ షీట్ దాఖ‌లు చేసిన త‌ర్వాత కోర్టులో వాద‌న‌లు జ‌ర‌గాలి. ఆ త‌ర్వాత ద‌ర్శ‌న్ నేరం చేసిన‌ట్లు దోషిగా తేలితే శిక్ష‌ని న్యాయ‌మూర్తి ఖ‌రారు చేస్తారు. ఆత‌ర్వాత పిరోల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చి షూటింగ్ లు పూర్తిచేయ‌వ‌చ్చు. ఈ కేసు విష‌యంలో ద‌ర్శ‌న్ కి సాక్షులంతా వ్య‌తిరేకంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఏ2 గా ఉన్న ద‌ర్శ‌న్ ప్రాధ‌మిక విచార‌ణ‌లో అత‌డినే నిందితుడుగా పోలీసులు భావిస్తున్నారు. దానికి సంబంధించి బ‌ల‌మైన సాక్షుల్ని ప్ర‌వేశ పెట్ట‌డానికి సిద్దంగా ఉన్నారు. ప్ర‌స్తుతం ద‌ర్శ‌న్ జ్యూడీషియ‌ల్ క‌స్ట‌డీలో భాగంగా ప‌ర‌ప్ప‌న్ అగ్ర‌హారం జైలులో ఉన్న సంగ‌తి తెలిసిందే.