చిరు, బాలయ్య కాదన్నాక నాగ్ ఒప్పుకుంటాడా..?
అందుకే నెక్స్ట్ సినిమాకు పూరీ సిద్ధం అనేలా ఉన్నా హీరోలెవరు ఆసక్తిగా లేదు.
By: Tupaki Desk | 8 March 2025 8:00 AM ISTఒకప్పుడు ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇప్పుడు సరైన ట్రాక్ లో లేడని తెలిసిందే. పూరీ సినిమా అంటే ఒకప్పుడు హీరోలంతా సిద్ధం అనేలా ఉండేవారు. కానీ ఇప్పుడు బాబోయ్ పూరీ అనేలా పరిస్థితులు మారాయి. పూరీ చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవడమే దీనికి ప్రధాన కారణం. లైగర్, డబుల్ ఇస్మార్ట్ ఇలా వరుస ఫ్లాపులతో కాదు కాదు డిజాస్టర్స్ తో పూరీ డిజప్పాయింట్ చేస్తున్నాడు. అందుకే నెక్స్ట్ సినిమాకు పూరీ సిద్ధం అనేలా ఉన్నా హీరోలెవరు ఆసక్తిగా లేదు.
ఐతే స్టార్ హీరోల కన్నా సీనియర్ హీరోలు కాస్త పూరీని కన్సిడర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. చిరంజీవితో ఆటోజానీ ఇంకా చర్చల్లోనే ఉంది. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. మరోపక్క బాలయ్యతో పైసా వసూల్ చేసిన పూరీ జగన్నాథ్ మరోసారి బాలకృష్ణతో సినిమా చేయాలని ఉత్సాహపడుతున్నాడు. ఐతే బాలయ్య కూడా పూరీతో సై అనేస్తున్నారు కానీ కమిటైన సినిమాలు పూర్తయ్యాకే అది కుదురుతుందని తెలుస్తుంది.
లేటెస్ట్ గా పూరీ జగన్నాథ్ కింగ్ నాగార్జునకు కథ సిద్ధం చేశాడని తెలుస్తుంది. పూరీ తో నాగ్ శివమణి సినిమా చేశాడు ఆ సినిమా సక్సెస్ అయ్యింది. నాగార్జున కూడా ఒక మంచి మాస్ సినిమా కోసం చూస్తున్నాడు. పూరీ సరైన కథతో వస్తే మాత్రం నాగార్జున సినిమా చేసేలా ఉన్నారు. ఐతే చిరు, బాలకృష్ణ కాదన్నాక నాగార్జున అయినా పూరీని యాక్సెప్ట్ చేస్తాడా లేదా ఆయన కూడా కాదంటారా అన్నది తెలియాల్సి ఉంది.
పూరీ జగన్నాథ్ మాత్రం తన ప్రయత్నాలు మానట్లేదు. ఈమధ్య బాలీవుడ్ స్టార్స్ తో కూడా పూరీ సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నాడని ముంబై మీడియా కథనాలు రాసుకొచ్చింది. ఐతే పూరీతో బీ టౌన్ స్టార్స్ కూడా సినిమా చేసే ఇంట్రెస్ట్ చూపట్లేదని తెలుస్తుంది. మరి పూరీ నెక్స్ట్ సినిమా ఎవరితో అన్నది చూడాలి.
పూరీ జగన్నాథ్ కంబ్యాక్ కోసం ఆయన ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఒకప్పటి పూరీలా సాలిడ్ హిట్ కొడితే మాత్రం మళ్లీ పూరీ హీరోయిజం తెర మీద చూపించే ఛాన్స్ ఉంటుంది. మరి ఆ హిట్టు బొమ్మ ఏది ఎవరితో అవుతుందో చూడాలి. ఐతే ఎవరు ఛాన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా తన ప్రయత్నాలు మాత్రం ఆపే ప్రసక్తే లేదన్నట్టుగా కనిపిస్తున్నాడు పూరీ జగన్నాథ్.