సీనియర్ భామలంతా 2025లో నైనా గుడ్ న్యూస్ చెబుతారా?
పాత ఏడాదికి గుడ్ బై చెబుతూ..కొత్త ఏడాదికి కోటి ఆశలతో అడుగు పెట్టడానికి తారాలోకమంతా సిద్దమవుతుంది. నూతన సంవత్సరం కలిసి రావాలని అంతా ఆశిస్తున్నారు.
By: Tupaki Desk | 16 Dec 2024 10:30 PM GMTపాత ఏడాదికి గుడ్ బై చెబుతూ..కొత్త ఏడాదికి కోటి ఆశలతో అడుగు పెట్టడానికి తారాలోకమంతా సిద్దమవుతుంది. నూతన సంవత్సరం కలిసి రావాలని అంతా ఆశిస్తున్నారు. వృత్తిగతంగా..వ్యక్తిగతంగా జీవితం మరింత సంతోష మయం కావాలని కోరుకుంటున్నారు. ఇక సీనియర్ భామల పరంగా చూసుకుంటే వృత్తి పరంగా వాళ్లకు తిరుగు లేదు. నటిగా అవకాశాలకు కొదవ లేదు. సినిమాలు చేస్తూ బిజీగానే కనిపిస్తున్నారు.
కానీ వ్యక్తిగత జీవితంలో వివాహం అనే బంధానికి మాత్రం దూరంగానే కొంత మంది భామలు కనిపిస్తున్నారు. ముఖ్యంగా త్రిష, అనుష్క, తమన్నాలు ఇంకా ధాంపత్య జీవితంలోకి అడుగు పెట్టలేదు. త్రిషకు ఇప్పటికే ఎంగేజ్ మెంట్ రద్దయింది. ఆ తర్వాత మళ్లీ పెళ్లి ప్రయత్నాలు చేయలేదు. మనసుకు నచ్చిన వాడు దొరకలేదంటూ అమ్మడు స్కిప్ కొడుతుంది. అలాగని పెళ్లి చేసుకోనని చెప్పలేదు. అందుకు సమయం కలిసి రావాలనే సమాధానమే అమ్మడి నోట వస్తుంది.
ఇక స్వీటీ అనుష్క పెళ్లి సైతం నిత్యం నెట్టింట అంతే హాట్ టాపిక్ అవుతుంది. తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారని, తెలుగింట కోడలవుతుందని ఆరేడేళ్లగా ప్రచారం తప్ప ఆ సందర్భం ఇంత వరకూ రాలేదు. సినిమాల సంఖ్య కూడా తగ్గే సరికి ఈసారి పెళ్లి ఖాయమనే అనుకున్న ప్రతీ సారి సినిమా ప్రకటనతో పెళ్లి విషయం దాటేస్తుంది. అలాగే మిల్కీబ్యూటీ తమన్నా ఇప్పటికే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్ షిప్ లో ఉంది.
ఇద్దరు ఘాడమైన ప్రేమలో మునిగి తేలుతున్నారు. కానీ లగ్గం ఎప్పుడంటే? మాత్రం తమన్నా వైపు నుంచి క్లారిటీ రావడం లేదు. విజయ్ వర్మ సిద్దంగా ఉన్నా తమన్నా కెరీర్ మీదనే ఫోకస్ చేస్తున్నట్లు చెబుతుంది. అమ్మడి నుంచి 2024 అంతా ఇదే సమాధానం వచ్చింది. మరి ఈ అందమైన సీనియర్ భామలంతా 2025 అయినా పెళ్లి శుభవార్త చెబుతారేమో చూడాలి.