Begin typing your search above and press return to search.

స్పిరిట్ కలెక్షన్స్ టార్గెట్స్.. వంగా ఆలోచన ఎలా ఉందంటే..

అదే మూవీని బాలీవుడ్‍ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి సక్సెస్ కొట్టారు.

By:  Tupaki Desk   |   2 March 2025 11:00 PM IST
స్పిరిట్ కలెక్షన్స్ టార్గెట్స్.. వంగా ఆలోచన ఎలా ఉందంటే..
X

సందీప్ రెడ్డి వంగా.. తీసింది ఇప్పటివరకు మూడు చిత్రాలే. కానీ పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు. తొలి మూవీ విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డిని తీసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. బ్లాక్‍ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. అదే మూవీని బాలీవుడ్‍ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి సక్సెస్ కొట్టారు.

ఆ తర్వాత 2023లో యానిమల్ మూవీతో బాక్సాఫీస్ సందీప్ షేక్ చేశారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇప్పుడు ఇండియా టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో ఉన్న ఆయన.. ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ మూవీ తీయనున్న విషయం తెలిసిందే. కొన్ని నెలల నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్న సందీప్... ఇప్పుడు షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నారు.

ప్రస్తుతం స్పిరిట్ పనులతో బిజీగా ఉన్న ఆయన.. రీసెంట్ గా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. స్పిరిట్ మూవీని ప్రస్తావించారు. 'షాహిద్, రణ్ బీర్ సింగ్ కు వాళ్ల కెరీర్ లోనే అతి పెద్ద హిట్స్ ఇచ్చారు. మరి ప్రభాస్ స్పిరిట్ కు మీ టార్గెట్ ఏంటి?' అని హోస్ట్ అడిగారు.

అయితే బాహుబలి, కల్కి వంటి చిత్రాలతో పాన్ ఇండియా లెవెల్ లో ప్రభాస్ హిట్స్ కొట్టిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ సమాధానమిచ్చారు. ఒకవేళ తన సినిమా, బాహుబలిని దాటాలంటే రూ.2000 కోట్లు కలెక్షన్స్ రావాలని సందీప్ తెలిపారు. అది చాలా పెద్ద టార్గెట్ అవుతుందని, ఇప్పటికైతే తాను మంచి సినిమా తీస్తానని చెప్పారు.

ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందనేది చూడాలని అన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిజానికి స్పిరిట్ పై ఇప్పుడు ఆడియన్స్ లో ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. కెరీర్ లో తొలిసారిగా పోలీస్ రోల్ చేయనున్న ప్రభాస్ కు భారీ హిట్ పక్కా అని అంతా ఫిక్సయ్యారు.

ప్రభాస్ నటించిన బాహుబలి-2, సలార్, కల్కి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్స్ గా నిలిచాయి. చివరగా.. ప్రభాస్ కల్కి మూవీతో రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టారు. మరోవైపు.. సందీప్ కూడా చివరగా యానిమల్ మూవీతో రూ.1000 కోట్లు సాధించారు. ఇప్పుడు స్పిరిట్ సినిమా రూ.వెయ్యి కోట్ల రాబట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి చూడాలి స్పిరిట్ ఎంత కలెక్ట్ చేస్తుందో...