ఇంత రక్తపాతం మహేశ్ చేసుంటే..?
అల్లు అర్జున్ చేసిన ఈ రా పాత్రలో మహేశ్‌ను ఊహించుకోవడం కష్టమే. ఎందుకంటే మహేశ్ మాస్ స్టైల్ వేరుగా ఉంటుంది
By: Tupaki Desk | 29 Sep 2023 8:29 AM GMTఏ హీరోకైనా అతడి మేనరిజం, స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ బట్టే కథలు సెట్ అవుతుంటాయి. లేదంటే కంటెంట్ ఎంత బలంగా ఉన్నప్పటికీ అవి సక్సెస్ సాధించడం కష్టమవుతుంది. అందుకే దాదాపుగా దర్శక రచయితలు ఫలానా హీరోను దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకుంటుంటారు.
అయితే విషయానికొస్తే.. తాజాగా రిలీజైన యానిమల్ సినిమా టీజర్ ఎంతగా ట్రెండ్ అయిందో తెలిసిన సంగతే. ఫుల్ వైలైన్స్తో వచ్చిన ఈ టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇందులో రణ్‌బీర్ బోల్డ్ యాక్టింగ్, మాస్ వైలెన్స్ హైడోస్లో ఉంది. అయితే ఇదే పాత్రలో మహేశ్‌ను ఊహించుకోండి. సెట్ అవ్వట్లేదు కదా.. కానీ వాస్తవానికి ఈ సినిమా కథను సందీప్ వంగా.. ముందుగా సూపర్ స్టార్ మహేశ్ బాబుకు చెప్పారట. కానీ బోల్డ్నెస్, వైలెన్స్ ఎక్కువ కావడం వల్ల మహేశ్ దాన్ని సున్నితంగా తిరస్కరించారని తెలిసింది.
కానీ ఇప్పుడా కథనే.. రణ్‌బీర్ కపూర్‌తో తీసి హైప్ పెంచారు సందీప్ వంగా. ఒకవేళ మహేశ్ ఇలాంటి వైల్డ్ క్యారెక్టర్‌కు ఒప్పకుని ఉన్నా అవి ఆయనకు అంతగా సెట్ అవ్వవు. ఫ్యామిలీ ఆడియెన్స్ ఆయన్ను అలా రిసీవ్ చేసుకోలేరు. ఇకపోతే పుష్ప కథ కూడా ముందుదా మహేశ్ దగ్గరికే వెళ్లిందట. కానీ మహేశ్.. అడవుల్లో దుంగలు స్మగ్లింగ్ చేసే పాత్రలంటే తనకు సెట్ కావని తప్పుకున్నారట.
అల్లు అర్జున్ చేసిన ఈ రా పాత్రలో మహేశ్‌ను ఊహించుకోవడం కష్టమే. ఎందుకంటే మహేశ్ మాస్ స్టైల్ వేరుగా ఉంటుంది. పోకిరి, బిజినెస్మెన్ తరహాలో క్లాస్ అండ్ మాస్ ఉంటే కనెక్ట్ అవుతుంది. ఇంకా గతంలోనూ ఏ మాయ చేశావే, గజినీ చిత్రాలు కూడా మొదటగా మహేశ్ దగ్గరికే వెళ్లాయట. ఇవి కూడా హిట్ అయ్యాయి.
కానీ నిజానికి ఈ పాత్రలు కూడా మహేశ్‌కు సెట్ అవ్వవనే చెప్పాలి. సూర్యలాగా మహేశ్‌ను గుండుతో చూడలేం. గౌతమ్ మేనన్ స్లో నరేషన్ కూడా మహేశ్‌కు సెట్ అవ్వవు. కాబట్టి ఈ చిత్రాలకు మహేశ్ నో చెప్పి మంచి పనే చేశారు. అలా అని మహేశ్ కథలను, పాత్రలను జడ్జ్ చేసే విషయంలో కరెక్ట్‌గా ఉంటారని కాదు. స్పైడర్, బాబీ, బ్రహ్మోత్సవం, వంశీ లాంటి ఆయన నటించిన సినిమాలు ఫెయిల్ కూడా అయ్యాయి.