'హనుమాన్' ఫైటర్ ను తట్టుకుంటుందా?
సౌత్, నార్త్, ఓవర్సీస్.. అనే తేడా లేకుండా విడుదలైన అన్నిచోట్ల రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది.
By: Tupaki Desk | 25 Jan 2024 2:02 PM GMTతేజ సజ్జా హీరోగా యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'హనుమాన్' ఈ సంక్రాంతికి జనవరి 12 న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు సంక్రాంతి బరిలో గుంటూరు కారం, సైంధవ్, నా స్వామి రంగ వంటి సినిమాలు విడుదలైనా వాటన్నిటిలో 'హనుమాన్' యునానిమస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సౌత్, నార్త్, ఓవర్సీస్.. అనే తేడా లేకుండా విడుదలైన అన్నిచోట్ల రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది.
సినిమా విడుదలై 13 రోజులు అవుతున్నా ఇంకా బాక్సాఫీస్ దగ్గర హనుమాన్ ర్యాంపేజ్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ చిత్రం నార్త్ లో అదరగొడుతోంది. డివోషనల్ కంటెంట్ కి బాలీవుడ్ ఆడియన్స్ ఎలాంటి ఆదరణ చూపుతారో మరోసారి హనుమాన్ ద్వారా నిరూపితమైంది. ఈ సినిమా ఇప్పటికీ బాలీవుడ్ లో స్ట్రాంగ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.
హనుమాన్ బుధవారం(జనవరి 24) హిందీలో దాదాపు కోటి రూపాయల కలెక్షన్స్ అందుకుంది. ఈ కోటి రూపాయలతో కలుపుకొని 'హనుమాన్' హిందీలో 39 కోట్ల నెట్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఎలాంటి స్టార్ కాస్ట్ లేకుండా, పెద్దగా ప్రమోషన్స్ చేయని ఈ సినిమా హిందీలో ఈ రేంజ్ కలెక్షన్స్ అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. దీన్నిబట్టి నార్త్ ఆడియన్స్ ఈ సినిమాపై ఎలాంటి ఆదరణ చూపిస్తున్నారో అర్థమవుతుంది.
ఇక ఈరోజు(జనవరి 25) బాలీవుడ్ లో హృతిక్ రోషన్ నటించిన 'ఫైటర్' మూవీ రిలీజ్ అయి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఇలాంటి తరుణంలో 'హనుమాన్' అక్కడ ఇదే స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందేమో చూడాలి. 'ఫైటర్' రిలీజ్ అయినా కూడా రిపబ్లిక్ డే నేషనల్ హాలిడే తో పాటు వీకెండ్ కూడా ఎంటర్ అవుతోంది. కాబట్టి కచ్చితంగా వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు 'హనుమాన్' హిందీలో మరింత ఎక్కువ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ఇండియన్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన 'హనుమాన్' సినిమాలో తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, గెటప్ శీను, సత్య, రోహిణి కీలక పాత్రలు పోషించారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ చిత్రాన్ని నిర్మించారు.