Begin typing your search above and press return to search.

మన వాళ్లు ఆ సాహసం చేయలేరా..?

కానీ మలయాళ పరిశ్రమలో అలా కాదు. కథ డిమాండ్ చేస్తే అతను ఎంత పెద్ద స్టార్ అయినా పాత్రకు తగినట్టు మారిపోవాల్సిందే.

By:  Tupaki Desk   |   23 Feb 2024 2:30 PM GMT
మన వాళ్లు ఆ సాహసం చేయలేరా..?
X

నటులు.. మహా నటులంతా కూడా ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు కొత్త కథలతో.. కొత్త పాత్రలతో చెప్పాలని వారు ఊహించని పాత్రలతో మెప్పించాలని అనుకుంటారు. సీనియర్ స్టార్స్ ఆ విషయంలో ముందుంటారు. అయితే మన టాలీవుడ్ స్టార్స్ ఇంకా ఇమేజ్ చట్రంలోనే ఉంటూ ఫ్యాన్స్ విజిల్ వేసే సినిమాలు చేస్తున్నారు. మన దగ్గర అలా సెట్ అయ్యింది. వారి ప్రయోగాలు చేసినా అందులో కూడా కమర్షియాలిటీ ఉండేలా చూసుకుంటారు. లేకపోతే మన అభిమానులకు ఎక్కదు. కానీ మలయాళ పరిశ్రమలో అలా కాదు. కథ డిమాండ్ చేస్తే అతను ఎంత పెద్ద స్టార్ అయినా పాత్రకు తగినట్టు మారిపోవాల్సిందే.

అందుకే కమర్షియల్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్నా మలయాళంలో ఒక కరెక్ట్ సినిమా పడగానే అందరు దాని వైపే చూస్తుంటారు. మలయాళ స్టార్ మమ్ముట్టి లేటెస్ట్ మూవీ భ్రమయుగం మరోసారి వార్తల్లు నిలిచేలా చేసింది. మమ్ముట్టి లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా బ్లాక్ అండ్ వైట్ బొమ్మగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఏదో ప్రయోగం చేస్తున్నాం కదా అని రొటీన్ కథను బ్లాక్ అండ్ వైట్ లో చెప్పలేదు.. ఒక కొత్త సెటప్ తో ఈ సినిమా తీశాడు డైరెక్టర్ రాహుల్ సదాశివన్.

రిలీజైన భ్రమయుగంకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమాలో కోడోమన్ పొట్టి పాత్రలో మరోసారి తన వర్సటాలిటీ చూపించారు. భ్రమయుగంలో మిస్టీరియస్ మ్యాన్ గా మమ్ముట్టి నటన ఆకట్టుకుంది. సీనియర్ స్టార్ గా ఆయన చేస్తున్న సినిమాలు.. చెబుతున్న కథలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి అందిస్తున్నాయి. అయితే భ్రమయుగం లాంటి కథలు తెలుగులో రావా.. మన మేకర్స్ అలాంటి సినిమాలు చేయలేరా అంటే చేస్తారు కానీ మన హీరోలు అలా చేసినా ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయలేరు.

తెలుగు సినిమా అంటే కమర్షియల్ సినిమా అనే ఒక మార్క్ పడిపోయింది. ఇక్కడ కూడా కొత్త కథలు.. కొత్త పాత్రలు వస్తున్నా కంప్లీట్ గా కథకు సరెండర్ అయ్యి క్యారెక్టర్ డ్రైవెన్ సినిమాలు తక్కువ అని చెప్పొచ్చు. ముఖ్యంగా సీనియర్ హీరోలు ఇలాంటి ప్రయోగాలు చేయాలంటే మాత్రం చాలా కష్టం. మలయాళంలో కంప్లీట్ గా అలాంటి సినిమాలకు మంచి సెటప్ ఉంటుంది. అందుకే అలాంటి సినిమాలు అక్కడ పర్ఫెక్ట్ గా కుదురుతాయి.