తగ్గేదెవరు? నెగ్గేదెవరు? బ్యాకెండ్ అసలేం జరుగుతోంది!
కోలీవుడ్ ఇండస్ట్రీని కంగువ షేక్ చేస్తుందనే హోప్స్ అందరిలోనూ కనిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 26 Aug 2024 5:39 AM GMTసూర్య కథానాయకుడిగా భారీ కాన్వాస్ పై తెరకెక్కుతోన్న 'కంగువ' పాన్ ఇండియాలో భారీ అంచనాల మధ్య రిలీజ్ కి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. దసరా సందర్భంగా అక్టోబర్ 10న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో అంచనాలు పీక్స్ కి చేరాయి. కోలీవుడ్ ఇండస్ట్రీని కంగువ షేక్ చేస్తుందనే హోప్స్ అందరిలోనూ కనిపిస్తున్నాయి.
పీరియాడిక్ థ్రిల్లర్ కావడంతో ట్రేడ్ సైతం ఎక్కడా తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో 'కంగువ' వేగానికి సూపర్ స్టార్ రజనీకాంత్ బ్రేక్ లు వేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. సరిగ్గా కంగువ రిలీజ్ రోజునే 'వెట్టేయాన్' కూడా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటన వచ్చింది. ఇది 160 కోట్ల బడ్జెట్ సినిమా. దీంతో ఒకే రోజు రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలపడితే పరిస్థితి ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు. సినిమాలు ఎలా ఉన్నా? ఏదో సినిమాపై వసూళ్ల ప్రభావం అయితే పడుతుంది.
అందులో కంగువ కార్నర్ అవుతుంది. రజనీ దూకుడు ముందు సూర్య నిలబడగలడా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కంగువ బయ్యర్లు అంతా సూర్య సోలోగానే వస్తే బాగుంటుందనే అభిప్రాయాలు నిర్మాతల దృష్టికి తీసుకెళ్తున్నట్లు సమాచారం. పోటీ పడే కంటే పోటీ లేని రోజుల్లోనే రిలీజ్ చేసుకుంటే మరింత లాభాలు చూసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారుట.
ఈనేపథ్యంలో కంగువ నిర్మాతలు లైకా ప్రొడక్షన్స్ తో సంప్రదింపులు జరిపినా? తమ సినిమాని మాత్రం వాయిదా వేసుకోమనే సమాధానం వచ్చిందిట. దీంతో `కంగువ`నే వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందని అంటున్నారు. సీనియర్ హీరోలంటే సూర్యకి ఎంతో గౌరవం. ఎంతో సౌమ్యుడు. నటుడిగా ఇతర స్టార్ హీలతో పోటీ పడతాడు తప్ప అనవసర వాదనలు చేసే హీరో కాదు. తన సినిమా ఏ హీరోకి పోటీగా రిలీజ్ చేయాలి అని డిమాండ్ చేసే నటుడు కాదు. అయితే రిలీజ్ అనేది పూర్తిగా నిర్మాతల అభియిష్టం మేరకు జరుగుతుంది కాబట్టి నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్లే. మరేం జరుగుతుందన్నది చూడాలి.