Begin typing your search above and press return to search.

మ్యాక‌ప్ అద్దంలో చూసుకోలేదా పీసీ ?

అమ్మ‌డు న్యూయార్క్ లో కాపురం పెట్టినా భార‌తీయ‌ పండుగ‌లు మాత్రం ఎంతో గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేస్తుంది.

By:  Tupaki Desk   |   14 Nov 2023 3:00 AM GMT
మ్యాక‌ప్ అద్దంలో చూసుకోలేదా పీసీ ?
X

దేశాలు దాటిపోయినా గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా మాత్రం భార‌తీయ సంప్ర‌దాయాలు మ‌ర్చిపోలేదు. భ‌ర్త వీదేశీయుడైనా త‌న ప‌ద్ద‌తుల్ని మాత్రం యధావిధిగా పాటిస్తుంది. ఈ విష‌యంలో నేను గ్లోబ‌ర్ స్టార్ ని కాదు.. కేవ‌లం భార‌తమాత ముద్దు బిడ్డ‌ని అని చాటి చెబుతుంది. అమ్మ‌డు న్యూయార్క్ లో కాపురం పెట్టినా భార‌తీయ‌ పండుగ‌లు మాత్రం ఎంతో గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేస్తుంది. అందులో నిక్ జోనాస్ ని భాగం చేస్తుంటుంది.


ఏడాదిలో వ‌చ్చే ప్ర‌తి పండుగ‌ను త‌ప్ప‌కుండా సెల‌బ్రేట్ చేస్తుంది పీసీ. అన్నీజాతీయ పండ‌గుల‌కు ట్రెడీష‌న‌ల్ దుస్తుల్లో ఆక‌ట్టుకుంటుంది. తాజాగా దీపావ‌ళిని కూడా భ‌ర్త‌త‌తో క‌లిసి గ్రాండ్ గానే సెల‌బ్రేట్ చేసుకుంది. పీసీ వెల్వెట్ మెరూన్ బ్లౌజ్‌తో పాటు డ్యూయల్ టోన్ లెహంగాను ధరించింది. సుగంధ గులాబీలతో జుట్టును ఎంచ‌క్కా అందంగా అలంకరించుకుంది. మెరూన్ టోన్‌లో బోల్డ్ ఐ షాడోను చూజ్ చేసుకుంది.


బోల్డ్ మెరూన్ కలర్ లిప్ స్టిక్ పూసుకుంది. బిందీ.. సింధూర్ కూడా ధరించింది. మెడ‌లో అంద‌మైన డైమండ్ నెక్లెస్ కూడా వేసుకుంది. ఇక నిక్ తెల్లటి కుర్తా, పూవుల ప్రింట్ ఉన్న జాకెట్ ధరించాడు. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉంది పీసీ వేసుకున్న మ్యాక‌ప్ మాత్రం టూమ‌చ్ గా ఉంది. మ్యాక‌ప్ పీసీ ముఖాన్ని పూర్తిగా మార్చేసింది. లిప్ స్టిక్..ఐబ్రోస్ అమ్మ‌డి రూపాన్ని మార్చేసింది.


బ్లౌజ్ కి మ్యాచ్ చేసే క్ర‌మంలో మిస్ మ్యాచ్ అయిన‌ట్లు ఉంది. ప్ర‌స్తుతం ఈఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. దీంతో పీసీ ఫాలోవ‌ర్లు ఎవ‌రు? ర‌క‌ర‌కాల కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. పీసీ రూపాన్ని చూసి దెయ్యం ఆకారంలో ఉందంట్లు పోస్ట్ లు పెడుతున్నారు. మ్యాక‌ప్ ఆర్టిస్ట్ తెలిసి చేసారా? తెలియ‌క చేసారా? పీసీ అద్దంలో మ్యాక‌ప్ చూసుకుందా? చూసుకోకుండా ఇలా ఇన్ స్టాలో కి వ‌చ్చేసిందా? అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.