బాక్సాఫీస్ వద్ద నిరూపిస్తే ఓటీటీల బోనస్‌లు?
OTT ప్లేయర్‌ల నుండి లాభదాయకమైన ఆఫర్‌లను పొందేందుకు తమ సినిమాల కంటెంట్ ని మరింత మెరుగుపరుచుకునేందుకు నిర్మాతలను ప్రోత్సహించే విధానమిది.
By: Tupaki Desk | 9 July 2024 2:08 PM GMTఓటీటీ వ్యాపారం రకరకాల ప్రత్యామ్నాయ విధానాలను అనుసరించడం, సినిమా ఆదరణను బట్టి ప్రోత్సాహకాలను అందించడం ఆశ్చర్యపరుస్తోంది. బాక్సాఫీస్ వద్ద సాధించిన వసూళ్ల రేంజును బట్టి కూడా ఇప్పుడు ఓటీటీలు బోనస్‌ను అందిస్తున్నాయి. 100 కోట్ల క్లబ్.. 500 కోట్ల క్లబ్.. 1000 కోట్ల క్లబ్ .. ఇలా చెప్పుకోదగ్గ వసూళ్లను అందుకుంటే వాటికి బోనస్ ఇచ్చేందుకు ప్రోత్సహించేందుకు ఓటీటీలు వెనకాడకపోవడం ఇప్పుడు ట్రెండ్ గా మారింది.
OTT ప్లేయర్‌ల నుండి లాభదాయకమైన ఆఫర్‌లను పొందేందుకు తమ సినిమాల కంటెంట్ ని మరింత మెరుగుపరుచుకునేందుకు నిర్మాతలను ప్రోత్సహించే విధానమిది. తాజా కథనాల ప్రకారం... దక్షిణాది నుండి విడుదలకు వస్తున్న భారీ పాన్ ఇండియా సినిమాలు ఉత్తరాదిన సాధించిన ఆదరణ ఆధారంగా ప్రోత్సాహకాలను అందించేందుకు ఓటీటీలు సుముఖంగా ఉన్నాయని సమాచారం. ఏడాది చివరిలో రానున్న సూర్య కంగువ సహా చాలా భారీ చిత్రాలకు ఈ తరహా ప్రోత్సాహకాలు అందే వీలుంది. హిందీ బాక్సాఫీస్ వద్ద సాధించే వసూళ్ల ఆధారంగా హిందీ-ఓటీటీ హక్కుల ధరలు నిర్ణయమవుతున్నాయని తెలుస్తోంది.
అయితే సినిమా బాగా ఆడిందా లేదా? బాక్సాఫీస్ లెక్కలు సరైనవేనా? అనేది ఓటీటీలు నిర్ధారించుకోవడమెలా? నిర్మాతలు స్వయంగా వెలువరించే బాక్సాఫీస్ లెక్కలను నమ్మేదెలా? అనేది కచ్ఛితంగా సమస్యాత్మకం. బాక్సాఫీస్ ఫిగర్స్ ని ఓటీటీల కోసం మ్యానిప్యులేట్ చేయరని గ్యారెంటీ ఏంటి? బాక్సాఫీస్ రెవెన్యూ లెక్కలను సరైన రీతిలో తనిఖీల చేయడం ఇక్కడ కీలకం కానుంది.