Begin typing your search above and press return to search.

బిగ్ షాక్‌: నాగార్జున హీరోయిన్‌ని గుర్తు ప‌ట్ట‌గ‌ల‌రా?

పెద‌వులు వాచిన‌ట్టు క‌నిపించ‌డంతో దానిని మీడియా ప‌దే ప‌దే హైలైట్ చేసింది.

By:  Tupaki Desk   |   22 Aug 2024 12:12 PM GMT
బిగ్ షాక్‌: నాగార్జున హీరోయిన్‌ని గుర్తు ప‌ట్ట‌గ‌ల‌రా?
X

ఈ హీరోయిన్ ఎవ‌రో గుర్తు ప‌ట్ట‌గ‌ల‌రా? అక్కినేని నాగార్జున స‌ర‌స‌న `సూప‌ర్`లో న‌టించింది. అనుష్క శెట్టి ఆరంగేట్రం చేసిన ఇదే సినిమాతో తాను కూడా తెరంగేట్రం చేసింది. బొద్దుగా ముద్దుగా భారీ అందాల‌తో క‌వ్వించిన ఈ భామ‌కు భీభ‌త్స‌మైన ఫాలోవ‌ర్స్ ఏర్పడ్డారు. ముఖ్యంగా ఈ బ్యూటీ సె* ముఖ‌క‌వ‌ళిక‌లు, హావ‌భావాల‌కు నాగ్ ఫ్యాన్స్ ప‌రేషాన్ అయ్యారు. కానీ ఆ త‌ర‌వాత పూర్తిగా హిందీ సినీప‌రిశ్ర‌మ‌కే అంకిత‌మైంది. ఒకానొక స‌మ‌యంలో త‌న అందం పెంచుకునేందుకు ముఖం, పెద‌వుల‌కు శ‌స్త్ర చికిత్స‌లు చేయించుకుంద‌ని, కానీ అవి విక‌టించి మొద‌టికే ముప్పు వ‌చ్చింద‌ని ప్ర‌చార‌మైంది.

పెద‌వులు వాచిన‌ట్టు క‌నిపించ‌డంతో దానిని మీడియా ప‌దే ప‌దే హైలైట్ చేసింది. కొన్ని ఉదంతాల త‌ర్వాత పూర్తిగా సినిమాల‌కు దూర‌మైంది. మీడియా గ్లేర్ నుంచి కూడా దూరంగానే ఉంది. కానీ ఇప్పుడు స‌డెన్ గా ప్ర‌త్య‌క్ష‌మైంది. అది కూడా ఒక కొత్త రూపంతో. ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా మారిపోయి క‌నిపించింది. ఈ రూపం చూశాక నెటిజ‌నులు ఫుల్ షాక్ లో ఉన్నారు. లేటెస్ట్ ఫోటో నెటిజన్లను షాక్ కి గురి చేస్తోంది! ఇంతకు ముందు చూసిన ఆమె ఈమేనా? అని అభిమానులు ఆరా తీస్తున్నారు. చాలా మంది ఈ కొత్త వేషం చూసి నిరాశ చెందారు. ఒకానొక సమయంలో బాలీవుడ్ క్వీన్ ఇలా అయిపోయిందేమిటీ అని విచారం వ్యక్తం చేసారు! ఇదంతా ఎవ‌రి గురించి అంటే అయేషా ట‌కియా గురించే.

అయేషా టాకియా వాంటెడ్-టార్జాన్ ది వండర్ కార్-సోచా నా థా వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో న‌టించింది. నాగార్జున‌- పూరి కాంబినేష‌న్ లో సూప‌ర్ సినిమాలో త‌న‌దైన అందం న‌ట‌న‌తో హృద‌యాలు కొల్ల‌గొట్టింది. ఈ బ్యూటీ 2009లో ఫర్హాన్ అజ్మీని పెళ్లాడినప్పటి నుండి లైమ్‌లైట్‌కు దూరంగా ఉంది. అక‌స్మాత్తుగా ఇప్పుడు సెల్ఫీ నెట్ లో పెను సంచలనం సృష్టించింది. ఇది అందరినీ షాక్‌కి గురి చేసింది. ఆయేషా నీలిరంగు చీర కట్టుకుని సెల్ఫీలో క‌నిపించింది. అయేషా ట‌కియా గుర్తుపట్టలేని విధంగా కనిపించింది. ఈ ఫోటోగ్రాఫ్ రెడ్డిట్‌లో వైరల్ కావడంతో నెటిజనులు స్పందించారు. ఒక నెటిజ‌న్ ఇలా అన్నారు...ఇది ఆయేషా టాకియా కాదు అని సందేహం వ్య‌క్తం చేసారు. త‌న‌కు ప్లాస్టిక్ సర్జరీ చేసారు..శస్త్రచికిత్స తర్వాత అలా అయింద‌ని నాకు తెలుసు. కానీ ఈ పోస్ట్ యాధృచ్ఛికంగా నా ఇన్‌స్టా డిస్కవర్ ఫీడ్‌లో కనిపించింది.. నేను ఆమెను గుర్తించలేకపోయాను అని రాసారు.

ఒక అభిమాని ఇలా వ్యాఖ్యానించాడు. ``నా చిన్ననాటి రోజుల్లో నేను ఆమెను చూసినట్లు గుర్తుంది.. నేను ఆమెను ప్రేమించాను. . దిల్ మాంగే మోర్.. టార్జాన్ నాకు ఇష్టమైనవి అని రాసారు.

ముంబయిలో రెస్టారెంట్ య‌జ‌మాని ఫర్హాన్‌ను వివాహం చేసుకున్నప్పుడు అయేషా టాకియాకు కేవలం 23 సంవత్సరాలు. ఈ బ్యూటీ 2013లో ఒక మగబిడ్డను స్వాగతించింది. అతడికి మికైల్ అని పేరు పెట్టింది. చివరిగా షాహిద్ కపూర్ నటించిన `పాఠశాల`లో అయేషా ట‌కియా న‌టించింది.