వచ్చేది డైనోసార్ ధనుష్.. రిస్క్ వద్దు!
ఈ ఏడాది మిగిలిపోయిన మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ప్రభాస్ సలార్ - షారుక్ డంకీ. డిసెంబర్ మూడో వారంలో ఇవి రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి
By: Tupaki Desk | 3 Oct 2023 12:30 AM GMTఈ ఏడాది మిగిలిపోయిన మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ప్రభాస్ సలార్ - షారుక్ డంకీ. డిసెంబర్ మూడో వారంలో ఇవి రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. సినీ ప్రియుల దృష్టంతా ఈ రెండు చిత్రాల మీదే ఉంది. దీంతో ఈ రెండు చిత్రాలకు అటు ఇటు కొద్ది రోజుల వరకు ఏ సినిమాలు వచ్చేందుకు సాహసం చేయవు! కానీ ధనుశ్ పాన్ ఇండియా మూవీ కెప్టెన్ మిల్లర్ మాత్రం విడుదల సాహసానికి సిద్ధంగా ఉంది.
డిసెంబర్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వాస్తవానికి ఈ చిత్రం విడుదల తేదీని ఎప్పుడో అనౌన్స్ చేశారు. అప్పటికీ షారుఖ్ ఖాన్ డంకీ మాత్రమే డిసెంబర్ రిలీజ్‌కు కన్ఫార్మ్ అయ్యింది. బాలీవుడ్ చిత్రం కావడంతో మిల్లర్ మేకర్స్.. పెద్ద పోటీగా భావించలేదు.
కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. అనూహ్యంగా సలార్ వచ్చి డిసెంబర్ మూడో వారానికి చేరింది. పైగా రీసెంట్‌గానే జవాన్‌తో మరో రూ.1000కోట్ల హిట్‌ను అందుకున్నారు షారుక్. అంటే ఇప్పుడు సలార్ - డంకీకి విపరీతమైన క్రేజ్ నెలకొని ఉంది. మరి ఇలాంటి సమయంలో కేవలం వారం రోజుల వ్యవధిలో ముందుగా వచ్చి.. మిల్లర్.. పైసా వసూలు చేయడం సాధ్యమేనా అంటే చెప్పడం కాస్త కష్టమే.
గతంలో... 2018 డిసెంబర్లో ధనుశ్ 'మారి 2' రిలీజ్ చేసినప్పుడు.. అప్పుడు పోటీగా.. షారుక్ ఖాన్ జీరో, యష్ కేజీయప్ ఛాప్టర్ 1, మోహన్ లాల్ ఒడియన్, అక్వమెన్ వంటివి ఉన్నాయి. అయినా కూడా 'మారి 2' కమర్షియల్‌గా మంచి సక్సెస్‌ను అందుకుంది. ఇప్పుడు కూడా అలాంటి సీన్ రిపీట్ అవుతుందనే ధీమాతో సినిమా రిలీజ్ చేస్తే.. కష్టమే! ఎందుకంటే ఈ సారి పోటీగా వచ్చేది డైనోసార్. తక్కువ అంచనా వేయలం. కాబట్టి.. మిల్లర్ ఫైనల్ డెసిషన్ చాలా క్యాలికులేషన్లపై ఆధారపడి ఉంటుంది.
ఒకవేళ ఢీ కొట్టేందుకు రెడీ అయిందా.. తమిళంలో ఓకే కానీ ఇతర భాషల్లో కష్టాలు తప్పవు. ఇకపోతే ఈ పీరియాడిక్ డ్రామాలో ప్రియాంకా మోహన్ హీరోయిన్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, సందీప్ కిషన్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజైన టీజర్ ఆకట్టుకుంది.