ధనుష్ మిల్లర్ బాక్సాఫీస్.. తెలుగులో మరీ ఇంత తక్కువనా?
అయితే తెలుగులో ఈ సినిమా ఓపెనింగ్స్ మాత్రం పేలవంగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హాలీడే రోజున విడుదలైనప్పటికీ కోటి రూపాయల కన్నా ఎక్కువ గ్రాస్ సాధించలేకపోయిందని అంచనా వేస్తున్నారు.
By: Tupaki Desk | 27 Jan 2024 7:56 AM GMTతమిళ హీరో ధనుష్ కథానాయకుడిగా, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, తెలుగు హీరో సందీప్ కిషన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం కెప్టెన్ మిల్లర్. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించారు. తమిళంలో సంక్రాంతికి విడుదలైందీ మూవీ. అప్పుడు తెలుగులో పోటీ ఎక్కువగా ఉండడంతో ఈ సినిమా విడుదల కాలేదు. కాస్త ఆలస్యంగా రిపబ్లిక్ డే కానుకగా నిన్న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
యుద్ధం నేపథ్యంతో సాగే ఈ సినిమాలో ధనుష్ మరోసారి అదరగొట్టారని నెటిజన్లు చెబుతున్నారు. ఇక శివరాజ్ కుమార్, సందీప్ కిషన్ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారని అంటున్నారు. రాజకుటుంబంలో పుట్టిన ప్రియాంక.. ఇంటి నుంచి పారిపోయి స్వాతంత్రం కోసం పోరాడే అమ్మాయిగా ఆకట్టుకుందని కొనియాడుతున్నారు.
అయితే తెలుగులో ఈ సినిమా ఓపెనింగ్స్ మాత్రం పేలవంగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హాలీడే రోజున విడుదలైనప్పటికీ కోటి రూపాయల కన్నా ఎక్కువ గ్రాస్ సాధించలేకపోయిందని అంచనా వేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్ద ప్రభావం చూపే అవకాశం లేదని అంటున్నారు. అయితే దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్.. రచనతోపైటు మేకింగ్ పరంగా చాలా చోట్ల తడబడ్డారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
కథేంటంటే..
స్టోరీ అంతా బ్రిటిషర్స్ టైం పీరియడ్ లో సాగుతుంటుంది. ఓ గ్రామానికి చెందిన శివన్న (శివరాజ్‌కుమార్) స్వరాజ్యం కోసం పోరాటం చేస్తుంటే.. అతడి తమ్ముడు అగ్నీశ్వర అలియాస్ అగ్ని (ధనుష్) బ్రిటిష్ సైన్యంలో చేరాలని నిర్ణయించుకుంటాడు. ఊరిలో కుల వివక్షతతో ఎన్నో అవమానాల్ని ఎదుర్కోవడమే అందుకు కారణం. సైన్యంలో చేరాక అగ్నికి బ్రిటిషర్లు కెప్టెన్ మిల్లర్ అని పేరు పెడతారు. శిక్షణ పూర్తయిన వెంటనే జరిగిన ఓ ఘటనతో అతడి ప్రయాణం మలుపు తిరుగుతుంది.
తన పై అధికారిని చంపేసి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతాడు హీరో. అందుకు తోటి సైనికుడు అయిన రఫీక్ (సందీప్ కిషన్) సాయం చేస్తాడు. బ్రిటిష్ సైన్యం నుంచి బయటికొచ్చాక అగ్ని ఓ దొంగగా మారతాడు. తన ఊళ్లో ఉన్న ఆలయంలో విగ్రహాన్ని చోరీ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ విగ్రహాన్ని దొంగతనం చేయడానికి కారణమేంటి? ఊరిపై దండెత్తిన బ్రిటిషర్లపై అగ్ని ఎలా పోరాటం సాగించాడు? అన్నదే మిగతా సినిమా.