సెలబ్రిటీల కేసులు కేరాఫ్ నార్సింగ్ పోలీస్ స్టేషన్!
హైదరాబాద్ లో ఎన్నో పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. సిటీ సామార్ధ్యాన్ని ఆధారంగా చేసుకుని ప్రజల రక్షణ కోసం అవసరం మేర పోలీస్ స్టేషన్లు ఉన్నాయి.
By: Tupaki Desk | 25 Sep 2024 5:45 AM GMTహైదరాబాద్ లో ఎన్నో పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. సిటీ సామార్ధ్యాన్ని ఆధారంగా చేసుకుని ప్రజల రక్షణ కోసం అవసరం మేర పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు సిటీలో ఉన్న అన్నీ పోలీస్ స్టేషన్ల కంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్ సెలబ్రిటీల పాలిట కేరాఫ్ అడ్రస్ పోలీస్ స్టేషన్ గా మారిపోయింది. సెలబ్రిటీల కేసులన్నీ కూడా అక్కడే ఎక్కువగా ఫైల్ అవుతున్నాయి. లా అండ్ ఆర్డర్ కేసులకంటే? సెలబ్రిటీల అత్యాచారం కేసులే అక్కడ హైలైట్ అవుతున్నాయి. తాజాగా యూట్యూబర్ హర్షసాయి పై కూడా అదే పోలీస్ స్టేషన్ లో అత్యాచారం కేసు నమోదైన సంగతి తెలిసిందే.
దీంతో పాటు రెండు కోట్ల డబ్బు కూడా తీసుకుని మోసం చేసాడని సదరు యువతి ఫిర్యాదు చేసింది. ఓసారి నార్సింగ్ పీఎస్ లో నమోదైన సెలబ్రిటీల అత్యాచారం కేసుల్లోకి వెళ్తే... హర్షసాయి కంటే ముందే టాలీవుడ్ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై అతడి శిష్యురాలు కూడా అత్యాచారం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడా కేసులో జానీ మాస్టర్ చంచల్ గూడ జైల్లో ఉన్నాడు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిడంతో వైద్య పరీక్షలు అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ కేసు విషయంలో ఇదే పీఎస్ కి జానీ మాస్టర్ భార్య అయేషా కూడా వెళ్లిన సంగతి తెలిసిందే.
అంతకు ముందు నటుడు రాజ్ తరుణ్‌పై అతడి ప్రియురాలు లావణ్య పెట్టిన అత్యాచారం కేసు ఎంత సంచలనమైందో తెలిసిందే. టీవీల్లో దీనిపై పెద్ద ఎత్తున డిబేట్లు నడిచాయి. శేఖర్ భాషా కూడా ఈ కేసులో వేలు పెట్టి ఎంతో ఫేమస్ అయ్యాడు. దీంతో బిగ్ బాస్ లోనూ అవకాశం అందుకున్న సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ సహా లావణ్య పీఎస్కి ఎన్నోసార్లు విచారణకు హాజరయ్యారు. ఇటీవలే మళ్లీ లావణ్య తన బంగారం, పుస్తెల తాడు, తాళి బొట్టు, డాక్యుమెంట్లు చోరీ చేశారని ఆరోపిస్తూ రాజ్ తరుణ్, మాల్వీపై మరో కేసు కూడా వేసింది.
వీటన్నింటికంటే ముందు యూ ట్యూబర్ , బిగ్ బాస్ ఫేం ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ పై కూడా ఇలాంటి కేసులే నమోదయ్యాయి. షాట్‌ఫిల్మ్‌లో ఛాన్స్ పేరిట షణ్ముక్, అతని సోదరుడు సంపత్ వినయ్ తనను మోసం చేశారని బాధితురాలు నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. సంపత్ పెళ్లిచేసుకుంటానని చెప్పి మోసం చేసి మరొకర్ని వివాహం చేసుకున్నాడని ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో వీడియోలు పెడతానని బెదిరించాడని బ్లాక్ మెయిల్ కేసు కూడా వేసింది.
పోలీస్ విచారణలో భాగంగా నానక్‌రామ్ గూడాలోని షణ్ముఖ్ ఇంట్లో గంజాయి దొరకడం కలకలం రేపింది. అలాగే మరో యూ ట్యూబర్చం చందు సాయి కేసుపై కూడా నార్సింగి పోలీసులు చీటింగ్ కేసు నమెదు చేసారు. నార్సింగికి చెందిన యువతిని చందు సాయి ప్రేమ పేరుతో మోసం చేశాడనేది అభియోగం. దీంతో అతనిపై అత్యాచారం, మోసం కేసు నమోదైంది. ఈ కేసులన్నీ నార్సింగ్ పీఎస్ ఫరిదిలోనే చోటు చేసుకున్నాయి. ఇలా యూట్యూబ్ నటులు, సినిమా నటులపై నార్సింగ్ పీఎస్ లో కేసులు నమోదవ్వడంతో పీఎస్ నెటి జనుల్లో హాట్ టాపిక్ గా మారింది.