2024 లో ఇండస్ట్రీలో విడాకులు మోత!
కానీ 2024 ఎరాలో వివాహ బంధం అన్నది ఎంతటి బలహీనంగా మారిందో కోర్టుల్లో విడాకుల కేసులు నమోదవుతోన్న తీరు చేస్తే చెప్పొచ్చు.
By: Tupaki Desk | 22 Nov 2024 8:30 AM GMTభారత్ లో వివాహ బంధాలు బలహీన పడుతోన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు వివాహ బంధానికి ఎంతో విలువ ప్రాధాన్యత కనిపించేది. భారత్ లో వివాహ వ్యవస్థ అంటే ఎంతో పటిష్టమైనదిగా ప్రపంచ దేశాలే మాట్లాడుకునేవి. కానీ 2024 ఎరాలో వివాహ బంధం అన్నది ఎంతటి బలహీనంగా మారిందో కోర్టుల్లో విడాకుల కేసులు నమోదవుతోన్న తీరు చేస్తే చెప్పొచ్చు. ఫ్యామిలీ కోర్టుల్లో కుప్పలు తిప్పలుగా విడాకుల దరఖాస్తులు కనిపిస్తున్నాయి.
సెలబ్రిటీల విషయానికి వస్తే? ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. తాజాగా 2024 లో విడాకులంటూ కొర్టు మెట్లు ఎక్కిన కొన్ని జంటల్ని చూస్తే.... ఇటీవలే మ్యూజిక్ లెజెండ్ ఏ.ఆర్ రెహమాన్-ఆయన భార్య సైరా భాను విడి పోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. రెహమాన్ అభిమానులకు ఇది పిడుగులాంటి వార్త. ఏనాడు వీళ్లిద్దరి ధాంపత్య జీవితం గురించి ఒక్క ప్రచారం కూడా బయటకు వచ్చింది లేదు.
అలాంటిది నేరుగా న్యాయ వాదులే రంగంలోకి దిగి విడిపోతున్నట్లు ప్రకటించడం అభిమానులు జీర్ణించుకోలేని అంశంగా మారింది. 30 ఏళ్ల బంధాన్ని విడాకులు అనే నాలుగు అక్షరాలతో వేరు చేస్తున్నారు. అంతకు ముందు జయం రవి-ఆర్తిల విడాకుల వ్యవహారం ఇంతే హాట్ టాపిక్ గా మారింది. జయం రవి మీడియా ముందుకొచ్చి విడాకుల ప్రకటన చేయడంతో ఆర్తీ షాక్ అయి తన అనుమతి లేకుండానే ప్రకటన వచ్చిందని వాదించింది.
ప్రతిగా జయం రవి తాను చెప్పాలనుకున్నది చెప్పాడు. కలపాలని ప్రయత్నించినా? అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాక ఈ రకమైన నిర్ణయంతో మీడియా ముందుకొచ్చినట్లు తెలిపాడు. ఈ రెండు కేసుల కంటే ముందు రెహమాన్ మేనల్లుడు జీవి. ప్రకాష్-సైందవి విడాకులు మీడియాలో అంతే హాట్ టాపిక్. 11 ఏళ్ల బంధాన్ని విడాకులతో వేరు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే కన్నడ జోడీ రాజ్‌కుమార్ -శ్రీదేవి బైరప్ప కూడా ఏడాది ఆరంభంలోనే విడాకులంటూ మీడియా ముందుకొచ్చారు.
ఇరువురు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుని రచ్చకెక్కారు. అప్పట్లో కన్నడ మీడియాలో ఇది హాట్ టాపిక్ గా మారిన అంశం. అలాగే మలయాళం నటి `భామ` కూడా భర్త అరుణ్ జగదీష్ తో విడిపోతున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది. బిడ్డ ఫోటోను షేర్ చేసి మరీ విడాకుల వార్త చెప్పింది. ఇక వీటన్నింకంటే ముందు ధనుష్-ఐశ్వర్య విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు. పెద్దలు కలపాలని రకరకాల ప్రయత్నాలు చేసినా సాధ్యపడలేదు. తాజాగా నిన్నటి రోజున ఇద్దరు కలిసి ఉండటం లేదు అన్న విషయాన్ని న్యాయస్థానానికి తెలియజేసారు. అందుకు గల కారణాల్ని తెలియజేసారు. అయితే కేసును 27కి వాయిదా వేసారు. 27 తర్వాత విడాకులు మంజూరు అయ్యే అవకాశం ఉంది.