దుబాయ్ సంగీత్: ఈవెంట్ కు వెళ్లు.. గిఫ్టు పట్టు..
టాలీవుడ్ నిర్మాత మహేష్ రెడ్డి కొడుకు పెళ్లి కోసం వారంతా దుబాయ్ కు చేరుకున్నారు.
By: Tupaki Desk | 25 Feb 2025 5:44 AM GMTటాలీవుడ్ సెలబ్రిటీల నుంచి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యాపార వేత్తలంతా ప్రస్తుతం ఓ పెళ్లి వేడుక కోసం దుబాయ్ లో ఉన్న విషయం తెలిసిందే. రెండు మూడు రోజుల నుంచి వాటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. టాలీవుడ్ నిర్మాత మహేష్ రెడ్డి కొడుకు పెళ్లి కోసం వారంతా దుబాయ్ కు చేరుకున్నారు.
అయితే దుబాయ్ లో వారు వెళ్లింది పెళ్లికి కాదు, సంగీత్ కోసమనేది తాజా అప్డేట్. ఆ సంగీత్‌కు సంబంధించిన విషయంలో కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. సంగీత్‌కు హాజరైన సెలబ్రిటీలందరికీ ఎంతో విలువైన రిటర్న్ గిఫ్టులు ఇచ్చారని తెలుస్తోంది. ఆడవారికి డైమండ్ ఆభరణాలు గిఫ్టుల రూపంలో ఇవ్వగా, మగవారికి రూ.25 లక్షల కంటే ఎక్కువ విలువుండే లగ్జరీ వాచ్ లను గిఫ్టులుగా ఇచ్చారని తెలుస్తోంది.
సాధారణంగా మనం పెళ్లిళ్లకు వెళ్లినపుడు వధూవరులకు గిఫ్ట్‌లు కానీ, కట్నాలు కానీ ఇస్తూంటాం. కానీ ఈ మధ్య పెళ్లికి వచ్చిన గెస్టులకు కూడా పెళ్లి కుమార్తె, కుమారుడి తరఫు వారు పెళ్లికి వచ్చినందుకు కృతజ్ఞతగా రిటర్న్ గిఫ్ట్‌లు ఇస్తున్నారు. ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి వాళ్లు ఈ రిటర్న్ గిఫ్టులను ఇస్తూ ఉంటారు. కానీ సదరు నిర్మాత సంగీత్‌కు హాజరైన వారందరికీ ఇంత కాస్ట్లీ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడంతో ఇప్పుడు ఈ విషయం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది.
ఈ సంగీత్ కు వెళ్లిన వారిలో టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్, తన భార్య ప్రణతి, నాగచైతన్య- శోభిత ధూళిపాళ, నాగార్జున- అమల, వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి, నితిన్ దంపతులతో పాటూ అక్కినేని అఖిత్ తన కాబోయే భార్యతో హాజరయ్యారు.
అయితే ఇదే సంగీత్‌కు ఏపీ మినిస్టర్ నారా లోకేష్ కూడా వెళ్లారని నెట్టింట వార్తలొస్తున్నాయి కానీ ఆయన కేవలం దుబాయ్ లో మ్యాచ్ చూడటానికి మరియు ఐసీసీ చైర్మన్ జై షాతో బాండింగ్ ను పెంచుకోవడానికి మాత్రమే వెళ్లాడు తప్ప ఎలాంటి ఈవెంట్ కు లోకేష్ హాజరు కాలేదు.