Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో హీరోల రెస్టారెంట్లు.. మీరెన్ని విజిట్ చేశారు?

మరి ఆ రెస్టారెంట్లు మన హైదరాబాద్ లో ఎక్కడనున్నాయి? ఏ హీరోలు లీడ్ చేస్తున్నారు? వంటి వివరాలు మీకోసం.

By:  Tupaki Desk   |   22 Feb 2025 3:40 AM GMT
హైదరాబాద్ లో హీరోల రెస్టారెంట్లు.. మీరెన్ని విజిట్ చేశారు?
X

టాలీవుడ్ హీరోల్లో అనేక మంది ఇప్పటికే ఫుడ్ బిజినెస్ లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మరికొందరు త్వరలోనే అడుగుపెట్టనున్నారు. పలువురు హీరోలు సినిమాల్లో నటిస్తూనే రెస్టారెంట్లు, కేఫ్ లు నడిపిస్తున్నారు. వాటిలో లభ్యమయ్యే ఫుడ్ అండ్ మిగతా ఐటెమ్స్ కోసం చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. మరి ఆ రెస్టారెంట్లు మన హైదరాబాద్ లో ఎక్కడనున్నాయి? ఏ హీరోలు లీడ్ చేస్తున్నారు? వంటి వివరాలు మీకోసం.

టాలీవుడ్ హల్క్ రానా.. శాంక్చువరీ బార్ & కిచెన్ ను జూబ్లీహిల్స్ లో నడిపిస్తున్నారు. రానా ఫ్యామిలీకి చెందిన పాత ఇంటిని రెనోవేషన్ చేయించి రెస్టారెంట్ గా మార్చారు. ఫిల్మ్ నగర్‌ లో ఉన్న ఆ విలాసవంతమైన రెస్టారెంట్.. ఎప్పుడూ ఫుల్ రష్ గా ఉంటుంది. మరోవైపు, యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ.. గుడ్ వైబ్స్ ఓన్లీ కాఫీ పేరుతో ఖాజాగూడలో పెట్టారు. అక్కడ కాఫీ చాలా స్పెషల్.

అక్కినేని నాగచైతన్య.. మాదాపూర్ లో షో యూ పేరుతో రెస్టారెంట్ ను స్టార్ట్ చేశారు. ఆసియా వంటకాలకు ఫేమస్ అయిన షో యూ.. హైదరాబాద్‌లోని మొట్టమొదటి ఖరీదైన పాన్-ఆసియన్ క్లౌడ్ కిచెన్లలో ఒకటిగా పేరుగాంచింది. మరోవైపు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. జూబ్లీ హిల్స్ లో ఉన్న ఫేమస్ అమెరికన్ స్పోర్ట్స్ బార్ అండ్ గ్రిల్ అయిన బఫెలో వైల్డ్ వింగ్స్‌లో అల్లు అర్జున్ ఇన్వెస్ట్మెంట్ చేశారు.. ఆయనే స్వయంగా ప్రారంభించారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ల వెంచర్ AN రెస్టారెంట్స్ గురించి తెలిసిందే. రాజకోటల నుంచి స్ఫూర్తి పొంది నిర్మించారు. అందులో మినర్వా కేఫ్ కూడా ఉంది. మరోవైపు, కొంత కాలం క్రితం యంగ్ హీరో శర్వానంద్.. బీంజ్ కాఫీ షాప్ ను స్టార్ట్ చేశారు. అక్కడ అనేక రకాల కాఫీలతోపాటు అరటికాయ బజ్జి, మిర్చి బజ్జీ, పునుగులు వంటి స్నాక్ ఐటెమ్స్ ఉంటాయి.

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ చాలా కాలం క్రితం వివాహ భోజనంబు రెస్టారెంట్ ను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో బ్రాంచీలు స్టార్ట్ చేసి సక్సెస్ ఫుల్ గా ఫుడ్ బిజినెస్ లో కొనసాగుతున్నారు. మరోవైపు, అనేక సినిమాలో సైడ్ క్యారెక్టర్ రోల్స్ లో నటించిన శశాంక్.. మాయాబజార్ రెస్టారెంట్ ను మొదలుపెట్టారు.

జూబ్లీహిల్స్, గచ్చిబౌలి ప్రాంతాల్లో దర్శకుడు సురేంద్రరెడ్డికి చెందిన ఉలవచారు రెస్టారెంట్ చాలా ప్రసిద్ధి గాంచింది. అక్కడ ఉలవచారు బిర్యానీ కోసం అంతా పోటీ పడుతుంటారు. ఎంతో ఇష్టమ్మీద తింటూ ఉంటారు. అలా ఇప్పటివరకు చెప్పిన రెస్టారెంట్లు, కేఫ్ కు సంబంధించిన వివరాలు, పిక్స్.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. మరి వాటిలో మీరు ఎన్ని విజిట్ చేశారో కౌంట్ చేసుకోండి!!