సోషల్ మీడియాకి దూరంగా సెలబ్రిటీలు!
వాటి నుంచి తప్పించుకోవాలంటే సోషల్ మీడియా కి దూరంగా ఉండటం ఒక్కటే చేయాలి.
By: Tupaki Desk | 22 Dec 2023 5:08 AM GMTసోషల్ మీడియాని సరిగ్గా బ్యాలెన్స్ చేయగల్గితే దానంత గొప్ప మాధ్యమం మరొకటి లేదు. రూపాయి ఖర్చు లేకుండా ప్రమోట్ చేసుకునే వెసులు బాటు కేవలం సోషల్ మీడియాలోనే దొరుకుతుంది. కానీ బ్యాలెన్స్ తప్పితేనే రకరకాల సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ట్రోలింగ్ బారిన పడాల్సి ఉంటుంది. విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలా రకరకాల సమస్యలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. వాటి నుంచి తప్పించుకోవాలంటే సోషల్ మీడియా కి దూరంగా ఉండటం ఒక్కటే చేయాలి.
తాజాగా కొంత మంది సెలబ్రిటీలు అలాగే సోషల్ మీడియాకి దూరమయ్యారు. బాలీవుడ్ మిస్టర్ పర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండేవారు. కానీ `లాల్ సింగ్ చడ్డా` తర్వాత సోషల్ మీడియా దూరమయ్యారు. కేవలం సినిమా అప్ డేట్స్ ఏవైనా ఉంటే ఇవ్వడం తప్ప మిగతా ఏ విషయాలో ఆయన షేర్ చేయడం లేదు. అలాంటి ముఖ్యమైన విషయాలు ఉంటేనే సోషల్ మీడియాకి వస్తా తప్ప లేదంటే ఇక రాను అని తెగేసి చెప్పేసారు.
ఈ విషయంలో అభిమానులు తనని తప్పుగా భావించొద్దని కోరారు. అలాగే దర్శక-నిర్మాత కరణ్ జోహార్ కూడా ఈ మధ్యనే సోషల్ మీడియాకి దూరమయ్యారు. వివిధ సందర్భాల్లో ట్రోలింగ్ బారిన పడటంతో..వాటికి సమాధానాలు చెప్పలేక ఎందుకొచ్చిన తలనొప్పి వ్యవహరమని ఆయన పూర్తిగా దూరమయ్యారు. అవసరమైతే తప్ప ఇటు వైపు చూడబోనని అన్నారు. ఇక బాలీవుడ్ హీరోయిన్లలో సోనాక్షి సిన్హా చాలా కాలం క్రితమే సోషల్ మీడియాకి గుడ్ బై చెప్పేసింది.
అమ్మడిపై నెట్టింట నెగిటివిటీ పెరిగిపోవడంతో కొత్త రకమైన సమస్యలు ఉత్పన్న అవుతున్నాయని ..ఇది తనకి ఏమాత్రం నచ్చలేదని నెట్టింట ప్రచారానికి దూరమైంది. అందుకే సోనాక్షి ఫోటోలు కూడా ఇన్ స్టాలో ఎక్కడా కనిపించలేదు. ఈ మధ్యనే పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి కూడా సోషల్ మీడియా దూరమైన సంగతి తెలిసిందే. `గుంటూరు కారం`లోనే ఓమై బేబి సాంగ్ ట్రోలింగ్ గురవ్వడంతో నెటి జనులతో అభ్యంతరం తలెత్తడంతో సోషల్ మీడియాకి గుడబై చెప్పేసారు.
అలాగే యువ దర్శకుడు వెంకేష్ మహా కూడా నెటి జనులు దాడిని తట్టుకోలేక సోషల్ మీడియాకి దూరమయ్యాడు. దర్శకుడు ప్రశాంత్ నీల్ పనితనంపై ఆయన చేసిన కొన్ని కామెంట్లు నెటి జనులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. దీంతో వాళ్ల ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక సోషల్ మీడియాకి దూరమయ్యాడు.