ప్రేమికుల రోజు ప్రేమతో ఒక్కటైన జంటలు!
మొదటగా ప్రేమ వివాహం అంటే అందరికీ గుర్తొచ్చే తొలి తరం జంట నాగార్జున-అమల. నేటి జనరేషన్ యువతకి ఈజోడీ ప్రేమ గురించి తెలుసు
By: Tupaki Desk | 14 Feb 2024 10:04 AM GMTఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం అంటే ప్రేమికులందరికీ ఎంతో ప్రత్యేకం. ప్రేమలో ఉన్న వారికి... ప్రేమించి పెళ్లి చేసుకున్న వారికి ఈ రోజంటే? రెగ్యులర్ డే కాదు. తమ మనసులో భావాలు.. అభిప్రాయా లు ఒకరితో ఒకరు ఎంతో ఇష్టంగా పంచుకుంటారు. మనసులో ప్రేమని తెలియజేసి ఆ ప్రేమని వివాహా నికి దారి తీసే గొప్ప డేగాను ఫిభ్రవరి 14ని సెలబ్రేట్ చేసుకుంటారు. టాలీవుడ్ నుంచి అలాంటి ప్రేమ జం టలు కొన్ని ఉన్నాయి. కొన్నాళ్ల పాటు ప్రేమ పావురాల్లో విహరించి వివాహ బంధంతో ఒకటైన ఆ జోడీల గురించి ఈ ప్రత్యేక కథనం...
మొదటగా ప్రేమ వివాహం అంటే అందరికీ గుర్తొచ్చే తొలి తరం జంట నాగార్జున-అమల. నేటి జనరేషన్ యువతకి ఈజోడీ ప్రేమ గురించి తెలుసు. ఓ సినిమా సెట్ లో ఇద్దరి మధ్య మొదలైన పరిచయం అది.. స్నేహంగా మారడం..అటుపై ప్రేమగా దారితీయడంతో 1992 లో వివాహ బంధంతో ఒకటయ్యారు. ఇద్దరు జంటగా ప్రేమయుద్దం..చినబాబు.. శివ..నిర్ణయం లాంటి చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. వివాహం తర్వాత అమల సినిమాలకు దూరమయ్యారు. అలాగే శ్రీకాంత్-ఊహలు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ఆమె సినిమా సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడం.. పెళ్లికి దారి తీయడం జరిగింది. ఇద్దరు జంటగా నాలుగు సినిమాలు చేసారు. ఆ తర్వాత ఊహ సినిమాలకు దూరమయ్యారు. ఇక రాజశేఖర్-జీవితలు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నవారే. మూడేళ్ల ప్రేమ అనంతరం వివాహ బంధంతో ఒకటయ్యారు. ఇద్దరు జంటగా ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. అలాగే జీవిత దర్శకత్వంలో రాజశేఖర్ సినిమాలు కూడా చేసారు.
ఇక మహేష్-నమ్రత ప్రేమల గురించి అందరికీ బాగా తెలిసిన విషయమే. `వంశీ` సినిమా సమయంలో మొదలైన పరిచయం చాలా వేగంగా ప్రేమగా మారడం...అటుపై పెళ్లికి దారి తీయడం...పెద్దల్ని ఒప్పించ డానికి మహేష్ పడిన పాట్లు తెలిసిందే. ఇద్దరు 2005లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నమ్రత సినిమా లకు దూరమయ్యారు. భర్త..ఇల్లు..పిల్లలే ప్రపంచంగా జీవిస్తున్నారు.
అలాగే రీసెంట్ గా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఓ సినిమా సెట్ లో మొదలైన ప్రేమ కొన్ని సంవత్సరాల అనంతరం పెళ్లికి దారి తీసింది. ఇటలీలో డెస్టినే షన్ వెడ్డింగ్ చేసుకున్నారు. అనంతరం హైదరాబాద్ లో భారీ రిసెప్షన్ కూడా జరిగింది. ఇంకా రామ్ చరణ్ -ఉపాసాన...బన్నీ-స్నేహ..నాని-అంజనా.. రానా-మిహికా... నిఖిల్-పల్లవి వర్మ అంతా ప్రేమించి పెళ్లి చసుకున్న వారే. కాకపోతే భార్యామణులంతా ఇండస్ట్రీకి చెందిన వారు కాదు. వీరంతా వివిధ వృత్తుల్లో కొనసాగుతున్న వారు.