సంక్రాంతి సినిమాల సెన్సార్ టాక్: ఏ సినిమా ఎలా ఉండబోతోంది?
మూడు చిత్రాల సెన్సార్ రిపోర్టులు రివీల్ అవ్వడంతో సినీ అభిమానులలో ఆసక్తి మరింత పెరిగింది.
By: Tupaki Desk | 9 Jan 2025 8:40 AM GMTసంక్రాంతి సీజన్ అనేది టాలీవుడ్ కు జాక్ పాట్ లాంటిది. మినిమమ్ టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్స్ అందుకోవడం పక్కా. ఇక ఈసారి విడుదలవుతున్న గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. మూడు చిత్రాల సెన్సార్ రిపోర్టులు రివీల్ అవ్వడంతో సినీ అభిమానులలో ఆసక్తి మరింత పెరిగింది.
గేమ్ చేంజర్: రన్ టైమ్ 165 నిమిషాలు
2 గంటల 45 నిమిషాల నిడివి గల గేమ్ చేంజర్ చిత్రం సెన్సార్ కమిటీ నుండి ప్రశంసలు అందుకుంది. రామ్ చరణ్ ద్విపాత్రాభినయం, శంకర్ మార్క్ యాక్షన్ సీక్వెన్సులు ఈ సినిమాకు బలం అవుతాయని తెలుస్తోంది. ముఖ్యంగా రెండు ప్రధానమైన ట్విస్టులు అలాగే అప్పన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా హైలైట్‌గా నిలుస్తుందట. అంజలి ఎమోషనల్ ఎపిసోడ్ కూడా హైలెట్ అవుతుందని తెలుస్తోంది. ట్రైలర్‌లో కనిపించని కొన్ని కీలక సన్నివేశాలు ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌గా ఉంటాయని సమాచారం. ఇంటర్వెల్ బ్లాక్ సినిమా రేంజ్‌ను మరో స్థాయికి తీసుకువెళ్తుందట. దీంతో ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
డాకు మహారాజ్: రన్ టైమ్ 150 నిమిషాలు
2 గంటల 30 నిమిషాల నిడివి గల డాకు మహారాజ్ సెన్సార్ రిపోర్ట్ కూడా పాజిటివ్‌గా ఉంది. నందమూరి బాలకృష్ణ, బాబీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం మాస్ ఆడియన్స్‌ను మెప్పించడానికి సిద్ధమైందని తెలుస్తోంది. ముఖ్యంగా డాకూ ఎపిసోడ్ బాగా డిజైన్ చేయబడిందని, బాలయ్య పాత్రలోని వైవిధ్యం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సమాచారం. ఈ సినిమాలో కీలకంగా మారనున్న చిన్నారి పాత్ర ట్విస్ట్ గురించి ట్రేడ్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది. పబ్లిక్ రిస్పాన్స్ ఎలా ఉంటుందనేది ఈ సినిమాకు కీలకం కానుంది.
సంక్రాంతికి వస్తున్నాం: రన్ టటైమ్ 160 నిమిషాలు
2 గంటల 40 నిమిషాల నిడివి గల సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాత్రం పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందింది. వెంకటేష్ నటన, అనిల్ రావిపూడి దర్శకత్వ శైలి క్లిక్కయితే, ఈ సినిమా పెద్ద విజయాన్ని అందుకోవచ్చని టాక్. ఫస్ట్ హాఫ్ పాత్రల స్వభావాలతో ఫన్ క్రియేట్ చేస్తాయట. ఇక సెకండ్ హాఫ్ వెంకీ తో పాటు హీరోయిన్స్ పాత్రలతో సాగే క్రైమ్ డ్రామా కామెడీ మరింత హైలెట్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. క్లైమాక్స్ సన్నివేశాలు వెంకీ మాస్ మానరిజాన్ని అభిమానులకు విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తారని తెలుస్తోంది.
మూడు సినిమాలూ వేర్వేరు జోనర్లలో ఉన్నప్పటికీ, పొంగల్ బరిలో ప్రేక్షకుల రుచులకు తగినవిగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. గేమ్ చేంజర్ ప్యాన్ ఇండియా స్థాయిలో బిజినెస్ చేస్తుండగా, డాకు మహారాజ్ తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ కోసం ఎదురుచూస్తోంది. మరోవైపు, సంక్రాంతికి వస్తున్నాం ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ సంక్రాంతి సీజన్ బాక్సాఫీస్ రిపోర్ట్ ఎలా ఉంటుందో చూడాలి.