లంచం ఇచ్చి సెన్సార్ ని ఇరికించిన విశాల్!
కోలీవుడ్ హీరో విశాల్ ముంబై సెన్సార్ బోర్డ్( సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) పై సంచలన ఆరోపణలు చేసారు
By: Tupaki Desk | 29 Sep 2023 6:12 AM GMTకోలీవుడ్ హీరో విశాల్ ముంబై సెన్సార్ బోర్డ్( సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) పై సంచలన ఆరోపణలు చేసారు. సెన్సార్ కార్యాలయంలోనూ అవినీతి పేరుకుపోయిందని ధ్వజమెత్తారు. తన కొత్త చిత్రం 'మార్క్ ఆంటోనీ' విషయంలో తనకెదురైన సమస్యపై ఈ వ్యాఖ్యలు చేసారు. ఈ మేకరకు సోషల్ మీడియా 'ఎక్స్' వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.
'అవినీతి తెరపై చూడటం ఒకేగానీ..నిజ జీవితంలోనూ జరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కువగాంది. ముంబై సెన్సార్ వేదిక అందుకు అడ్డగా మారిపోయింది. నా సినిమా మార్క్ ఆంటోనీ హిందీ వెర్షన్ సెర్సార్ పనులు పూర్తిచేసేందుకు సంబంధింత అధికారులకు 6.5 లక్షలు తీసుకున్నారు. స్క్రీనింగ్ కోసం 3.5 లక్షలు.. సర్టిఫికెట్ కోసం 3 లక్షలు తీసుకున్నారు.
నా కెరీర్ లో ఇలాంటి అవనీతి ఇంతవరకూ చూడలేదు. ఏ సినిమా విషయంలోనూ ఇలా జరగలేదు. లంచం ఇవ్వడం ఇష్టం లేకపోయినా మరో దారి లేక డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. నాకే కాదు భవిష్యత్ లో ఏ నిర్మాతకు ఇలా జరగకూడదు. ఎంతో కష్టపడి సాధించిన డబ్బు ఈ రూపంలో పోవడానికి ఆస్కారం ఉండకూడదు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ.. మహరాష్ట్ర ముఖ్యమంతి ఏక్ నాధ్ షిండే దృష్టికి తీసుకెళ్తాను.
న్యాయం గెలుస్తుందని ఆశిస్తున్నా. ఇలాంటివి ఆపకపోతే దేశ భవిష్యత్ కే ప్రమాదం' అని పోస్ట్ లో పేర్కొన్నారు. ఇప్పుడీ వ్యాఖ్యలు నెట్టింట.. సహ దేశమంతా సంచలనంగా మారాయి. సెన్సార్ పై ఇప్పటివరకూ ఇలాంటి ఆరోపణల్ని ఏ నటుడుగా నీ..నిర్మాత గానీ..దర్శకుడగానీ చేయలేదు. తొలిసారి విశాల్ ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో పాటు..న్యాయ పోరాటం చేస్తానని నిర్ణయించడంతో సంచలనంగా మారింది. ఈ వివాదంపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని నెటి జనులు సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు. విశాల్ ఆరోపణలు నిజమైతే! సెన్సార్ పె ఇది పెద్ద మచ్చే అవుతుంది.