అరవింద్ మాట మీద చైతన్య నమ్మకం!
చైతన్య, పల్లవి కలిసి ఇప్పటికే పలు ప్రధాన నగరాల్లో తండేల్ కు సంబంధించిన ఈవెంట్లలో పాల్గొని, అక్కడి మీడియాకు ఇంటర్వ్యూలిస్తూ బిజీబిజీగా ఉన్నారు.
By: Tupaki Desk | 6 Feb 2025 2:30 PM GMTనాగ చైతన్య, సాయి పల్లవి నటించిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్బంగా మేకర్స్ చిత్ర ప్రమోషన్స్ ను నెక్ట్స్ లెవెల్ లో నిర్వహిస్తున్నారు. చైతన్య, పల్లవి కలిసి ఇప్పటికే పలు ప్రధాన నగరాల్లో తండేల్ కు సంబంధించిన ఈవెంట్లలో పాల్గొని, అక్కడి మీడియాకు ఇంటర్వ్యూలిస్తూ బిజీబిజీగా ఉన్నారు.
నాగ చైతన్య ఈ సినిమాతో తెలుగు, తమిళ, హిందీ ఆడియన్స్ ను టార్గెట్ చేశాడు. ఎలాగైనా తండేల్ తో మంచి హిట్ అందుకుని ఈ మూడు భాషల్లో క్రేజ్‌తో పాటూ తన మార్కెట్ ను కూడా పెంచుకోవాలని చూస్తున్నాడు. నాగ చైతన్య కెరీర్లోనే తండేల్ భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. కాబట్టి తండేల్ బ్లాక్ బస్టర్ అవాలంటే బాక్సాఫీస్ వద్ద చాలా పెద్ద మొత్తంలోనే కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.
అయినప్పటికీ తండేల్ సినిమా గ్రాండ్ సక్సెస్ అవుతుందని నాగ చైతన్య చాలా ధీమాగా ఉన్నాడు. దానికి కారణం నిర్మాత అల్లు అరవింద్. ఇప్పటికే అల్లు అరవింద్ తండేల్ సినిమా చూసి చాలా బావుందని, ఆ నమ్మకంతోనే చెప్తున్నా సక్సెస్ మీట్ లో తండేల్ గురించి మరిన్ని వివరాలు చెప్తానని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అన్న విషయం తెలిసిందే.
ఏదైనా సినిమాను ప్రివ్యూ థియేటర్లో చూశాక ఆ సినిమా ఫ్యూచర్ ఏంటనేది కరెక్ట్ గా చెప్పడంలో అల్లు అరవింద్ దిట్ట అని, సినిమా చూశాక అరవింద్ గారు తనతో నీ కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ ఫిల్మ్ అవుతుందని, నేషనల్ అవార్డు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పారని, ఆయన మాటల్ని బట్టే తాను కూడా తండేల్ సక్సెస్ ను మరింత స్ట్రాంగ్ గా నమ్ముతున్నట్టు చైతన్య వెల్లడించాడు.
ఇదిలా ఉంటే గత కొన్ని సినిమాలుగా వరుస ఫ్లాపులతో అక్కినేని ఫ్యామిలీ హీరోలు తెగ ఇబ్బంది పడుతున్నారు. చైతన్యకు కూడా గత రెండు మూడు సినిమాలుగా అన్నీ డిజాస్టర్లే. ఈ నేపథ్యంలో అక్కినేని ఫ్యాన్స్ ఆశలన్నీ రేపు రిలీజ్ కాబోతున్న తండేల్ పైనే ఉన్నాయి. మరి తండేల్ వారి ఆశలను ఏ మేరకు నిలబెడుతుందో చూడాలి.