Begin typing your search above and press return to search.

నాగ చైతన్య దోశ.. కార్తి బిర్యాని..!

నాగ చైతన్య, సాయి పల్లవి జంట ప్రత్యేకంగా కనిపిస్తున్న ఈ సినిమా ప్రేమకథతో పాటు దేశభక్తిని కూడా చూపించబోతున్నారని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   31 Jan 2025 2:35 PM GMT
నాగ చైతన్య దోశ.. కార్తి బిర్యాని..!
X

నాగ చైతన్య సాయి పల్లవి జతగా చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా తండేల్. ఫిబ్రవరి మొదటి వారం అనగా ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. సినిమాను నేషనల్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. నాగ చైతన్య, సాయి పల్లవి జంట ప్రత్యేకంగా కనిపిస్తున్న ఈ సినిమా ప్రేమకథతో పాటు దేశభక్తిని కూడా చూపించబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమా తమిళ్ ట్రైలర్ రీసెంట్ గా చెన్నైలో రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా కోలీవుడ్ స్టార్ కార్తి అటెండ్ అయ్యాడు.

అక్కినేని ఫ్యామిలీకి కార్తి చాలా క్లోజ్ అన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా నాగార్జున, కార్తి బ్రదర్ బాండింగ్ చాలా స్పెషల్ గా ఉంటుంది. వాళ్లిద్దరు కలిసి ఊపిరి సినిమాలో నటించారు. అప్పటి నుంచి హైదరాబాద్ కార్తి వస్తే నాగార్జున దగ్గరకు.. నాగ్ చెన్నై వెళ్తే కార్తిని కలవడం జరుగుతుంది. ఐతే నాగ చైతన్య కూడా కార్తికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక తండేల్ తమిళ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో నాగ చైతన్య, కార్తి ఒకే వేదిక మీద కనిపించడం ఫ్యాన్స్ కి ట్రీట్ అనిపించింది. ఐతే ఈ కార్యక్రమంలో భాగంగా నాగ చైతన్యకు చెన్నైలో ఏ ఫుడ్ తినడానికి ఇష్టపడతాడని యాంకర్ అడగ్గా.. చైతన్య శరవణ భవన్ దోశ అని సమాధానం ఇచ్చాడు. ఇక కార్తిని మీకు హైదరాబాద్ లో ఏది ఇష్టమని అడిగితే ఎన్ కన్వెన్షన్ లో నాగార్జున గారు ఏర్పాటు చేసే బిర్యాని ఇష్టమని అన్నాడు. హైదరాబాద్ బిర్యాని కూడా ఇష్టమని అన్నాడు కార్తి.

సో నాగ చైతన్య చెన్నై దోశ గురించి చెబితే కార్తి హైదరాబాద్ బిర్యాని గురించి చెప్పాడు. ఇద్దరు హీరోలు వారికి ఇష్టమైన ఫుడ్ అది కూడా వేరు వేరు ప్లేస్ లలో చెప్పడం ఆడియన్స్ ని అలరించింది. ఇక నాగ చైతన్య శరవణ భవన్ దోశ అని చెప్పగానే యాంకర్ ఇక ఆ దోశకి డిమాండ్ పెరుగుతుందని సరదాగా అన్నారు. తండేల్ తమిళ్ ఈవెంట్ లో నాగ చైతన్యతో కస్టడీ సినిమా చేసిన వెంకట్ ప్రభు కూడా అటెండ్ అవగా మరో దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ కూడా వచ్చి టీం ని విష్ చేశారు.