నాగ చైతన్య మరో ప్రేమకథ..?
తండేల్ తర్వాత నాగ చైతన్య విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు.
By: Tupaki Desk | 9 March 2025 8:15 AM ISTతండేల్ తో సూపర్ సక్సెస్ అందుకున్నాడు అక్కినేని హీరో నాగ చైతన్య. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విషయంలో ముందు నుంచి అంచనాలు ఉన్నాయి. ఐతే వాటికి తగినట్టుగానే సినిమా ఉండటంతో సినిమా సూపర్ హిట్ అందుకుంది. ముఖ్యంగా నాగ చైతన్యని 100 కోట్ల క్లబ్ లో నిలబెట్టింది తండేల్ సినిమా. సినిమాలో చైతన్య, సాయి పల్లవి జోడీ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. తండేల్ తర్వాత నాగ చైతన్య విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు.
నాగ చైతన్యతో కార్తీక్ దండు మరో థ్రిల్లింగ్ కథతో రాబోతున్నాడని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుండగా చైతు నెక్స్ట్ సినిమా ప్లానింగ్ కూడా సెట్ రైట్ అవుతున్నట్టు తెలుస్తుంది. నాగ చైతన్య కార్తీక్ దండు సినిమా తర్వాత మరోసారి ప్రేమకథతో రాబోతున్నాడని టాక్. ఈమధ్యనే ఒక డైరెక్టర్ చెప్పిన కథకు నాగ చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
అక్కినేని హీరోలు లవ్ స్టోరీస్ తీస్తే ఆ లెక్క వేరేలా ఉంటుంది. ఇప్పటికే చైతన్య కెరీర్ లో ఎన్నో లవ్ స్టోరీస్ చేశాడు. నెక్స్ట్ లవ్ స్టోరీ కూడా బాగుంటుందని అంటున్నారు. అంతేకాదు సినిమా ప్రేమ కథ అయినా అన్ని వర్గాల ఆడియన్స్ మెప్పించేలా కథ కథనాలు ఉంటాయని అంటున్నారు. తండేల్ సినిమాతో కెరీర్ లో కొత్త ఉత్సాహం తెచ్చుకున్న చైతన్య ఎలాంటి సినిమా అయినా సరే కష్టపడితే తప్పకుండా ప్రతిఫలం సాటిస్ఫైడ్ గా ఉంటుందని ప్రూవ్ చేశాడు.
అందుకే ఇక చేయబోయే సినిమాలకు కూడా అదే ఫాలో అవ్వాలని ఫిక్స్ అయ్యాడు. కార్తీక్ దండు సినిమా కూడా థ్రిల్లర్ జోనర్ లో పాన్ ఇండియా అటెంప్ట్ చేయబోతున్నారు. ఈ సినిమా గురించి కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, సౌండింగ్ అంతా కూడా ఈ సినిమాకు వేరే లెవెల్ లో ఉండబోతాయని అంటున్నారు.
సినిమాలే కాదు నాగ చైతన్య వెబ్ సీరీస్ లతో కూడా సర్ ప్రైజ్ చేస్తున్నాడు. ధూత సీరీస్ తో సూపర్ సక్సెస్ అందుకున్న చైతన్య ఆ సీరీస్ సీజన్ 2 లో కూడా అదరగొట్టబోతున్నాడు. అక్కినేని హీరోల్లో ఫ్యాన్స్ ని సినిమా వెంట సినిమాతో అలరిస్తూ ఆడియన్స్ కి దగ్గర అవుతున్నాడు నాగ చైతన్య.