Begin typing your search above and press return to search.

తండేల్ రాజుకు పుష్పరాజ్ ఫుల్ సపోర్ట్..!

ఫిబ్రవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   22 Jan 2025 12:30 AM GMT
తండేల్ రాజుకు పుష్పరాజ్ ఫుల్ సపోర్ట్..!
X

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఫిబ్రవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు పాటలు హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. జనవరి 24న 'హైలెస్సో హైలెస్సా' అనే థర్డ్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.


‘తండేల్’ చిత్రాన్ని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దాదాపు 90 కోట్లు ఖర్చు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇది నాగచైతన్య కెరీర్ లోనే హయ్యస్ట్ బడ్జెట్ సినిమా. అద్భుతంగా వచ్చిందని ఇన్సైడ్ టాక్. ఈసారి అభిమానులు కాలర్ ఎగరాస్తారని నిర్మాతలు ధీమాగా చెబుతున్నారు. అక్కినేని ఫ్యాన్స్ కు తోడుగా ఇప్పుడు ఐకాన్ స్టార్ ఆర్మీ కూడా ఈ సినిమాకి డ్యూటీ చెయ్యడానికి రెడీ అయ్యాయి.

అల్లు కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అల్లు అర్జున్ అభిమానులు 'తండేల్' పై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. అక్కినేని అభిమానులు ఎంతగా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారో.. బన్నీ ఫ్యాన్స్ కూడా అదే స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. మొన్నటి వరకూ 'పుష్ప 2' పోస్టులతో సోషల్ మీడియాని హోరెత్తించిన అల్లు ఆర్మీ.. ఇప్పుడు నాగచైతన్య సినిమాకి తమవంతు సపోర్ట్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా ట్రైలర్ రిలీజ్ చేసి, ప్రమోషన్స్ స్పీడ్ పెంచాలని మేకర్స్ కు రిక్వెస్టులు పెడుతున్నారు. తండేల్ రాజ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు పుష్పరాజ్ ను తీసుకురావాలని సూచిస్తున్నారు.

'తండేల్' సినిమాతో చైతూని 100 కోట్ల క్లబ్ లో కూర్చోబెడతానని బన్నీ వాసు పేర్కొన్నారు. చైతన్య సైతం ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డాడు. మత్స్యకారుడిగా కనిపించడానికి తనని తాను మార్చుకున్న తీరుకి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ సినిమాతో కచ్ఛితంగా బ్లాక్ బస్టర్ కొట్టాలని చైతూ గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలో అక్కినేని అభిమానులతో పాటుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మద్దతు కూడా తోడవ్వడం కలిసొచ్చే అంశం. చైతన్యపై అందరికీ మంచి అభిప్రాయం ఉంటుంది కనుక, మిగతా ఫ్యాన్ డమ్స్ కూడా ఈ చిత్రానికి సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది.

శ్రీకాకుళం జిల్లాలోని డి. మచ్చిలేశం గ్రామంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా 'తండేల్' సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రాజు, బుజ్జి తల్లి మధ్య అద్భుతమైన ప్రేమకథను ఆవిష్కరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి శ్యామ్‌ దత్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. వాలెంటైన్స్ వీక్ లో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చెయ్యాలని చూస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా పోటీ కూడా లేదు కాబట్టి, భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. చూద్దాం.. బాక్సాఫీస్ వద్ద తండేల్ రాజు తాండవం ఎలా ఉంటుందో..!