Begin typing your search above and press return to search.

బుజ్జితల్లి సాంగ్ వచ్చాక శోభిత చాలా ఫీలైంది: నాగ చైత‌న్య‌

అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాసు నిర్మించిన ఈ సినిమాకు చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

By:  Tupaki Desk   |   3 Feb 2025 3:49 AM GMT
బుజ్జితల్లి సాంగ్ వచ్చాక శోభిత చాలా ఫీలైంది: నాగ చైత‌న్య‌
X

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కెరీర్లో భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన తండేల్ సినిమా మ‌త్య్స‌కారుల నిజ జీవిత క‌థ ఆధారంగా రూపొందిన విష‌యం తెలిసిందే. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాసు నిర్మించిన ఈ సినిమాకు చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. చైతూ ఈ సినిమా కోసం ఎంతో గ్రౌండ్ వ‌ర్క్ చేసి చాలా క‌ష్ట‌ప‌డ్డాడు.

గ‌త కొన్ని సినిమాలుగా స‌రైన హిట్ లేక ఇబ్బంది ప‌డుతున్న చైత‌న్య ఈ సినిమాతో ఎలాగైనా సాలిడ్ హిట్ అందుకుని స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాల‌ని తెగ ట్రై చేస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో తండేల్ చిత్ర ప్ర‌మోష‌న్స్ లో చైత‌న్య చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నాడు. ప్ర‌మోష‌న్స్ లో భాగంగా చిత్ర యూనిట్ అన్న‌పూర్ణ స్టూడియోస్ లో తండేల్ జాత‌ర పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌హించింది.

ఈ ఈవెంట్ లో చైత‌న్య భార్య శోభితా ధూళిపాల ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. ఈవెంట్ కు హాజ‌రైన చిత్ర యూనిట్ కు సంబంధించిన వైర‌ల్ వీడియోలు, ఫోటోల‌ను ప్లే చేసి వారితో కాసేపు గేమ్ ఆడింది యాంక‌ర్ సుమ‌. అందులో భాగంగా చైతూకి సంబంధించిన వైర‌ల్ ఫోటోగా పెళ్లి ఫోటోను స్క్రీన్ పై చూపించి, శోభిత‌కు ఏదైనా పాట కానీ డైలాగ్ కానీ డెడికేట్ చేయాలంటే ఏది చేస్తార‌ని అడిగింది.

దానికి స‌మాధానంగా తండేల్ లోని బుజ్జిత‌ల్లి సాంగ్‌నే డెడికేట్ చేస్తాన‌ని, ఎందుకంటే అస‌లైన బుజ్జిత‌ల్లి తానే అని, త‌న‌ను ఇంట్లో బుజ్జిత‌ల్లి అనే పిలుస్తాన‌ని, తండేల్ సినిమా డిస్క‌ష‌న్ టైమ్ లోనే ఈ విష‌యాన్ని డైరెక్ట‌ర్ తో చెప్పాన‌ని చైతూ అన్నాడు. దానికి డైరెక్ట‌ర్ చందూ మొండేటి, అవును, పెళ్లి టైమ్ లో సినిమా వ‌ర‌కే బుజ్జిత‌ల్లి సాయి ప‌ల్ల‌వి, అది నా పేరు అని ఫీల‌వుతూ చెప్పిన‌ట్టు తెలిపాడు.

అంతేకాదు, తండేల్ లోని సూప‌ర్ హిట్ సాంగ్ అయిన బుజ్జితల్లి సాంగ్ వ‌చ్చాక శోభిత చాలా ఫీలైంద‌ని, ఆ పేరును త‌ను చాలా ప‌ర్స‌న‌ల్ గా ఫీల‌వుతుంద‌ని చైత‌న్య ఈ సంద‌ర్భంగా రివీల్ చేసి, ఆ త‌ర్వాత బుజ్జిత‌ల్లి వ‌చ్చేస్తున్నా క‌దే డైలాగ్ ను శోభిత కోసం చెప్పాడు చైత‌న్య‌. మొత్తానికి అలా తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగ చైత‌న్య‌, శోభిత ప‌ర్స‌న‌ల్ లైఫ్ హైలైట్ అయింది.

ఫిబ్ర‌వ‌రి 7న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ సినిమాలో నాగ చైత‌న్య స‌ర‌స‌న హీరోయిన్ గా సాయి ప‌ల్ల‌వి న‌టిస్తుంది. తండేల్ లో వారిద్ద‌రి న‌ట‌న నెక్ట్స్ లెవెల్ లో ఉంటుంద‌ని చిత్ర యూనిట్ ముందు నుంచి చెప్పుకుంటూ వ‌స్తుంది. దానికి త‌గ్గ‌ట్టే ఇప్ప‌టివ‌ర‌కు రిలీజైన కంటెంట్ ను చూస్తే వారిద్ద‌రి మ‌ధ్య‌ కెమిస్ట్రీ బాగా వ‌ర్కవుట్ అయిన‌ట్టు అర్థమ‌వుతుంది.